Breaking News

బిజెపి మహిళా మోర్చా కమిటీ ఏర్పాటు

 

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిజెపి జిల్లాకార్యాలయంలో గురువారం నగర మహిళా మోర్చా కమిటీ నియమించారు. నగర ప్రధాన కార్యదర్శిగా పల్నాటి శ్రీలక్ష్మి, కార్యదర్శిగా శైలజను నియమించడం జరిగింది. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్త మాట్లాడుతూ బిజెపి మహిళలకు పెద్ద పీట వేస్తుందని, కేంద్ర మంత్రివర్గంలో కూడా మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి కీలకశాఖలు అప్పగించారని అన్నారు. రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం ఒక్క మహిళను కూడా మంత్రిగా నియమించకపోవడం శోచనీయమని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలు శక్తివంతులని, వారిని ప్రోత్సహిస్తే అన్ని రంగాల్లో ముందుకు వెళతారని ఈ సందర్భంగా అన్నారు. కార్యక్రమంలో నగర మహిళా మోర్చా అధ్యక్షురాలు శోభ, ఉపాధ్యక్షురాలు వరలక్ష్మి, కార్యదర్శి ఉమరిబాయి, సుగుణ, తదితరులున్నారు.

Check Also

ఆర్థిక ప్యాకేజీతో అన్ని వర్గాల‌కు ఊరట…

నిజామాబాద్‌, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ నిజామాబాద్‌ నగర శాఖ ఆధ్వర్యంలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *