Breaking News

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో ఇద్దరిపై కేసు నమోదు

 

బీర్కూర్‌, డిసెంబర్‌ 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ అనిల్‌రెడ్డి తెలిపారు. ఎస్‌ఐ కథనం ప్రకారం… బుధవారం రాత్రి బొమ్మన్‌దేవుపల్లి గ్రామం ఎక్స్‌రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేపడుతున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు మద్యం సేవించి బైక్‌ నడుపుతుండగా గుర్తించి కేసు నమోదు చేసినట్టు తెలిపారు. గురువారం వారిని బాన్సువాడ కోర్టుకు పంపినట్టు వివరించారు. సదరు వ్యక్తులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో తిరిగి పట్టుబడితే జైలుకు పంపుతారని తెలిపారు. సిబ్బంది ప్రమోద్‌, సంగమేశ్వర్‌ ఉన్నారు.

Check Also

ఇందల్వాయి టోల్‌ప్లాజా వద్ద అన్నదానం

నిజామాబాద్‌, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హెల్ప్‌ టు అదర్స్‌ సంస్థ ఆద్వర్యంలో ఇందల్వాయి టోల్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *