Breaking News

విద్యార్థులకు మెను ప్రకారం భోజనం అందించాలి

 

బీర్కూర్‌, డిసెంబర్‌ 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వసతి గృహ విద్యార్థులకు మెను ప్రకారం భోజనం అందించాలని బిసి వసతి గృహ డివిజన్‌ అధికారి కేశవులు అన్నారు. బీర్కూర్‌ మండల కేంద్రంలోగల బిసి బాలుర వసతి గృహాన్ని గురువారం ఆయన తనిఖీ చేశారు. ముందుగా వసతి గృహంలోని విద్యార్థుల సరుకుల రిజిష్టర్లు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వసతి గృహ విద్యార్థులకు ప్రతినెల కాస్మొటిక్‌ చార్జీలు అందిస్తున్నారా అని అడిగారు. ప్రస్తుత చలికాలంలో విద్యార్థులకు దుప్పట్లు అందించాలని సూచించారు. కార్యక్రమంలో వార్డెన్‌ రాములు పాల్గొన్నారు.

Check Also

ప్రణాళికా బద్దంగా వ్యవసాయం చేసి లాభాలు గడించాలి

నిజామాబాద్‌, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వానాకాలంలో వ్యవసాయంపై మండల‌ స్థాయి అధికారుల‌తో జిల్లా కలెక్టర్‌, ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *