Breaking News

అమ్మకు ఆత్మీయతతో, బిడ్డకు ప్రేమతో కెసిఆర్‌ కిట్‌

 

బీర్కూర్‌, డిసెంబర్‌ 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అమ్మకు ఆత్మీయతతో బిడ్డకు ప్రేమతో అందించడమే కెసిఆర్‌ కిట్‌ ముఖ్య ఉద్దేశమని నసురుల్లాబాద్‌ అంగన్‌వాడి సూపర్‌ వైజర్‌ శ్రీలత అన్నారు. నసురుల్లాబాద్‌ మండల కేంద్రంలోని గ్రామ సచివాలయంలో అంగన్‌వాడిలకు కెసిఆర్‌ కిట్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు మొదటి, రెండవ గర్భ సమయంలో మరియు కాన్పు అయిన తర్వాత సర్కారు దవాఖాన, ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో సేవలందుకున్న వారికి ఆర్థిక సహాయం మరియు కెసిఆర్‌ కిట్‌ అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశమన్నారు. గర్భవతి సమయంలో మరియు పాలిచ్చే తల్లులకు పోషకాహారం సమకూర్చుకోవడానికిప్రభుత్వం నాలుగు విడతలుగా అమ్మాయి పుడితే 13 వేలు, అబ్బాయికి 12 వేలు అందించడం జరుగుతుందని అన్నారు. అంగన్‌వాడిలు తమ పరిధిలోని బాలింతలకు కెసిఆర్‌ కిట్‌పై అవగాహన కల్పించి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు జరిగేలా చూడాలని సూచించారు. హెల్త్‌ సూపర్‌ వైజర్‌ కృష్ణవేణి, అంగన్‌వాడిలు పాల్గొన్నారు.

Check Also

పోలీస్‌ అమరవీరులకు నివాళి

నందిపేట్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నందిపేట్‌ పోలీస్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *