Breaking News

నిజాంసాగర్‌

 

నిజాంసాగర్‌, డిసెంబర్‌ 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ ఆయకట్టుకు నీటి విడుదల, గుత్ప, అలాసాగర్‌ ఎత్తిపోతలకు శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి నీటిని తీసుకునే అంశంపై రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి నివాసంలో గురువారం సమీక్ష సమావేశం జరిగింది. బాల్కొండ ఎమ్మెల్యే, మిషన్‌ భగీరథ వైస్‌ఛైర్మన్‌ వేముల ప్రశాంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ సిఇ ఆర్‌. మధుసూదన్‌రావు, ఎస్‌ఇ. గంగాధర్‌ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిజాంసాగర్‌ ప్రాజెక్టు, గుత్ప, అలీసాగర్‌ ఎత్తిపోతల కింద మొత్తం 2.10 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఈ యాసంగిలో నీరందిస్తున్నామన్నారు.. ప్రస్తుతం నిజాంసాగర్‌ ప్రాజెక్టులో 15 టిఎంసిల నీరు అందుబాటులో ఉందని పేర్కొన్నారు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి గుత్ప, అలీసాగర్‌ ఎత్తిపోతల కోసం 2.4 టిఎంసిల నీరు తీసుకోవడానికి ప్రభుత్వం అనుమతించిందని, ఈ మొత్తాన్ని అవసరాలకు అనుగుణంగా మూడు విడతలలో తీసుకోవాలని మంత్రి సూచించారు.

గుత్ప, అలీసాగర్‌లో ప్రస్తుతం ఒక్క మోటారు ద్వారా నీటి విడుదల జరుగుతుందని, అవసరాన్ని బట్టి మిగతా మూడు మోటార్లను కూడా నడిపించాలని సూచించారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టు కాలువ మొదటి భాగంలో డిస్ట్రిబ్యూటరీలకు నీటిని క్రమబద్దీకరించి చివరి వరకు నీరు అందేవిధంగా ఇరిగేషన్‌ అధికారులు ప్రణాళిక తయారుచేసుకోవాలని సూచించారు. మండల స్థాయి అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తు ఏఏ డిస్ట్రిబ్యూటరీ అవసరాలకు ఎంత అవసరమో ఆ మోతాదులోనే నీటిని వాడుకోవాలన్నారు. నీటి వృధా అరికట్టి, పొదుపుగా వాడుకోవాలని, రెవెన్యూ, పోలీసు, వ్యవసాయ శాఖాధికారులతో కూడిన కమిటీలను ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. నీటిపారుదల శాఖాధికారులు ఈ కమిటీలతో అనుసంధానమై పనిచేయాలని సూచించారు. నీటిపారుదల శాఖ ఎ.ఇ.లు కాలువలపై తిరుగుతూ గ్రామాల నీటి అవసరాలకు అనుగుణంగా డిస్ట్రిబ్యూటరీలకు, పిల్ల కాలువలకు నీటిని విడుదల చేయాలని, నాట్లు పూర్తయిన, అవసరంలేని డిస్ట్రిబ్యూటరీలకు నీటి విడుదల తగ్గించాలని పేర్కొన్నారు. అత్యవసరమైతే తప్ప అధికారులు సెలవు తీసుకోకూడదని, అందరూ క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉంటూ నిరంతరం పర్యవేక్షించాలన్నారు.

Check Also

యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలని సమాచార శాఖ డిప్యుటి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *