Breaking News

పార్లమెంటులో వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలి

 

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎస్‌సి వర్గీకరణ బిల్లును వచ్చే శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేస్తు ఎంఆర్‌పిఎస్‌ ఆధ్వర్యంలో స్థానిక ఆర్‌డివో కార్యాలయం ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా యువసేన అధ్యక్షుడు ఓముల సురేశ్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని వెంట తీసుకొని ఢిల్లీకి వెళ్లి శీతాకాల సమావేశాల్లో ఎస్‌సి లకు సంబంధించి ఎ,బి,సి,డి వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టేలా చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. డప్పుకు, చెప్పుకు రూ. 2 వేల పింఛన్‌ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ధర్నా కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు రవి, కార్యదర్శి సుధాకర్‌, పట్టణ అధ్యక్షురాలు సరిత, తదితరులు పాల్గొన్నారు.

Check Also

రైతుకు లాభసాటి వ్యవసాయం అందించటమే ప్రభుత్వ ఉద్దేశ్యం

నిజామాబాద్‌, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏది చేసినా తెలంగాణ రాష్ట్రం, ప్రజల ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *