Breaking News

గల్ప్‌ మోసాలపై ఉక్కుపాదం

 

– నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీసు కమీషనరేట్‌ పరిధిలో గల్ప్‌ ఏజెంట్ల మోసాలు అరికట్టేందుకు గల్ప్‌ హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేస్తున్నట్టు కమీషనర్‌ కార్తికేయ తెలిపారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన అన్యువల్‌ క్రైమ్‌ రివ్యు-2017 సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. నిజామాబాద్‌ పోలీసు కమీషనరేట్‌ పరిధిలో 2017 సంవత్సరంలో 6117 కేసులు నమోదైనట్టు, గత ఏడాదితో పోలిస్తే చైన్‌ స్నాచింగ్‌ కేసులు 8 శాతం తగ్గాయని, 33 శాతం దొంగతనం కేసులు తగ్గాయని అన్నారు. అలాగే రోడ్డు ప్రమాదాలు 7.4 శాతం తగ్గాయని కమీషనర్‌ తెలిపారు. వైట్‌ కాలర్‌ నేరాలు గత ఏడాదితో పోలిస్తే ఈయేడాది 49 కేసులు పెరిగాయని, ప్రజలకు ట్రాఫిక్‌ అవగాహన కల్పించేలా చర్యలు చేపడుతున్నామని, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు గత ఏడాదితో పోలీస్తే 504 వరకు పెరిగాయని, జిల్లాలో ఆత్మహత్యలు తగ్గాయని సిపి అన్నారు.

గత ఏడాది 360 మంది ఆత్మహత్యలకు పాల్పడగా ఈయేడు 232 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని వివరించారు. జిల్లా వ్యాప్తంగా 443 సఖి షీ కమిటీలు ఏర్పాటు చేశామని, డయల్‌ 100కు 16 వేల 107 కాల్స్‌ రాగా అందులో 250 తప్పుడు కాల్స్‌ ఉన్నాయని, జిల్లా కేంద్రంతోపాటు భీమ్‌గల్‌, సిర్నాపల్లి లాంటి గ్రామీణ ప్రాంతాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేశారని అన్నారు. కమ్యూనిటి సిసి కెమెరాలు ఏర్పాటు చేసే ఆవశ్యకత ఎంతైనా ఉందని కమీషనర్‌ తెలిపారు. రానున్న రోజుల్లో కమీషనరేట్‌ పరిధిలో కీలకమైన ప్రాంతాలు గుర్తించి సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తామని, ప్రజలు కూడా తమ కాలనీల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా వివిధ కేసులు పరిష్కరించడంలో సఫలీకృతులైన పోలీసు అధికారులను కమీషనర్‌ అభినందించారు.

Check Also

చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ దాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులు తీసుకువచ్చే ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *