Breaking News

సేంద్రీయ వ్యవసాయంపై రైతులకు అవగాహన

 

బీర్కూర్‌, డిసెంబర్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండలంలోని సంబాపూర్‌ గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పరంపరాగత్‌ కృషి వికాస్‌ యోజన అనే సేంద్రీయ వ్యవసాయంపై అవగాహన సదస్సు నిర్వహించారు. బాన్సువాడ ఎడిఎ చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో సదస్సు ఏర్పాటు చేశారు. రైతులు వ్యవసాయం చేసేటపుడు పాటించాల్సిన యాజమాన్య పద్దతుల గురించి వివరించారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించి అధిక లాభాలు గడించేలా వ్యవసాయం చేస్తేనే రైతుకు పెట్టుబడి పోను నికర రాబడి వస్తుందని చెప్పారు.

నారుపోసిన నాటినుండి నాట్లు వేసేదాక, నాట్లు వేసిన నుండి మొదటి కలుపుదీసి రెండవ కలుపుతీసి, రెండు దఫాలుగా రసాయన ఎరువులువాడి, అవసరాన్ని బట్టి పురుగు మందు కొట్టినట్టయితే చీడపీడల బారినుండి పంట కాపాడుకోవచ్చన్నారు. దోమపోటు ఎక్కువగా రాకుండా ఉండాలంటే నాటును తగిన సాంద్రతతోనే పట్టాలన్నారు. కాలిబాటలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. ప్రధానమంత్రి ఫసలబీమా యోజన ద్వారా పంటలకు బీమా చేసుకోవాలని బీర్కూర్‌ ఏఓ కమల అన్నారు. కార్యక్రమంలో ఏఈవోలు శ్రావణ్‌కుమార్‌, కావ్యశ్రీ, గ్రామ రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్‌ బైరాపూర్‌ హన్మంత్‌రావు, నాగపూర్‌ లాలయ్య, ఉపసర్పంచ్‌ మోహన్‌, రైతులు రామకృష్నగౌడ్‌, రాంచందర్‌, శ్రీనివాస్‌రావు, వెంకయ్య, హన్మాండ్లు తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఆయా డివిజన్‌ల‌లో పారిశుద్య పనులు పరిశీలించిన మేయర్‌

నిజామాబాద్‌, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ కార్పొరేషన్‌ పరిదిలో జరుగుతున్న ప్రత్యేక పారిశుద్ధ్య పనుల‌ను ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *