Breaking News

విద్యావ్యవస్థ బలోపేతానికి చర్యలు

 

నిజాంసాగర్‌, డిసెంబర్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థుల సౌకర్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం వంట పాత్రలు, ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేస్తుందని సిడిసి ఛైర్మన్‌ పట్లోల్ల దుర్గారెడ్డి, నీటివినియోగ దారుల సంగం అధ్యక్షుడు గంగారెడ్డి, సర్పంచ్‌ బేగరి రాజులు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ప్రిన్సిపాల్‌ సరోజన, ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వర్లు కలిసి విద్యార్థినిలకు పాత్రలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వసతి గృహాల్లో నిరుపేద విద్యార్థులు చదువుకుంటున్నారని, ఈ విషయాన్ని గుర్తించిన సిఎం కెసిఆర్‌ ప్రభుత్వం విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేస్తున్నారన్నారు. సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. అలాగే రాబోయే చలికాలం దృస్ట్యా విద్యార్థినిలకు దుప్పట్లు పంపిణీ చేస్తున్నామన్నారు. వారానికి ఒకసారి మాంసాహారాన్ని అందజేయడం జరుగుతుందని, చదువులో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని అన్నారు. కార్యక్రమంలో సుమన్‌బాయి, గీత, పద్మావతి, ఫర్జానా బేగం, తదితరులున్నారు.

Check Also

ప్రతి ఒక్కరు అల‌ర్ట్‌

నిజామాబాద్‌, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో కోవిడ్‌ కేసులు పెరుగుతున్నందున మరింత అప్రమత్తంగా ఉండాల‌ని ...

Comment on the article