Breaking News

పేదలకు అందని ద్రాక్షగా విద్య, వైద్యం

 

– టి మాస్‌ స్టీరింగ్‌ కమిటీ సభ్యులు రమేశ్‌బాబు

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో పేదలకు విద్య, వైద్యం అందని ద్రాక్షగా మారిందని టి మాస్‌ స్టీరింగ్‌ కమిటీ సభ్యులు రమేశ్‌బాబు అన్నారు. నిజామాబాద్‌లోని సంజీవయ్య కాలనీలోని కమ్యూనిటి భవనంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరై మాట్లాడారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ రాష్ట్రాన్ని సింగపూర్‌ మారుస్తారని చెప్పి ఇపుడు ఎటు చూసినా అవినీతి, లంచగొండితనానికి తోడు తెరాస నాయకులు పలు వివాదాల్లో ఇరుక్కుంటున్నారని ఆయన ఆరోపించారు. నిజామాబాద్‌ నగరంలో మోకాళ్ల లోతున్నగుంతలతో రోడ్లు తవ్వి నరకానికి దారి చూపిస్తున్నారని, బయటకు వెళ్లిన వ్యక్తి తిరిగి ఇంటికి చేరుతాడో లేడో అని తెలియని పరిస్థితిలో నగర ప్రజలు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సబ్బనిలత, మధు, శ్రీనివాస్‌, హైమద్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

రైతును రాజు చేయాల‌న్నదే ప్రభుత్వ ఉద్దేశ్యం

నిజామాబాద్‌, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాబోయే ఖరీఫ్‌ సీసన్‌లో వ్యవసాయంపై జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *