Breaking News

తెరాస క్యాలెండర్‌ ఆవిష్కరించిన ఎమ్మెల్యే

 

కామారెడ్డి, డిసెంబర్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస పార్టీ ఆధ్వర్యంలో ముద్రించిన 2018 నూతన సంవత్సర క్యాలెండర్‌లను శుక్రవారం సాయంత్రం ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గంప గోవర్దన్‌ ఆవిష్కరించారు. స్థానిక ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. 2018లో రైతులందరికి మేలు కలగాలని భగవంతుని కోరుతున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో తెరాస ఫుడ్‌ కమిటీ రాష్ట్ర ఛైర్మన్‌ తిరుమల్‌రెడ్డి, నాయకులు మామిండ్ల రమేశ్‌, చంద్రశేఖర్‌రెడ్డి, చాట్ల రాజేశ్వర్‌, లక్ష్మినారాయణ, రమేశ్‌గౌడ్‌, తదితరులున్నారు.

Check Also

రక్త హీనతతో బాధపడుతున్న మహిళకు రక్తదానం

కామారెడ్డి, మే 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన సుజాత అనే మహిళ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *