Breaking News

రెండోరోజుకు చేరిన ఎంఆర్‌పిఎస్‌ దీక్ష

 

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పార్లమెంటులో ఎస్‌సి వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి అమలు చేయాలని డిమాండ్‌ చేస్తు మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి ఆధ్వర్యంలో చేపడుతున్న ధర్నా శుక్రవారం నాటికి రెండోరోజుకు చేరింది. ఈ సందర్భంగా ధర్నానుద్దేశించి ఎంఆర్‌పిఎస్‌ రాష్ట్ర కార్యదర్శి ఎర్రం రాంచందర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ బిల్లుపై శ్రద్ద వహించి అఖిలపక్షం నాయకులను ఢిల్లీకి తీసుకెళ్లి శీతాకాల సమావేశాల్లో ఏ,బి,సి,డి, వర్గీకరణ బిల్లు అమలు చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. లేనియెడల తాము రానున్న రోజుల్లో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నాలో జిల్లా యువసేన అధ్యక్షుడు ఓముల సురేశ్‌, పట్టణ సభ్యులు రవి, కార్యదర్శి ప్రభాకర్‌, పట్టణ అధ్యక్షురాలు సరిత, ఉప కులాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

బోరుమోటారు ప్రారంభం

కామారెడ్డి, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 18 వ వార్డులోని అర్కల గల్లిలో బోర్‌ మోటార్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *