Breaking News

పింఛన్‌ కొరకు రోడ్డెక్కిన లబ్దిదారులు

 

బీర్కూర్‌, డిసెంబర్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని అంకోల్‌ గ్రామ పంచాయతీలో పింఛన్‌ ఇవ్వడంలేదంటూ లబ్దిదారులు నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్దిదారులు మాట్లాడుతూ గత మూడురోజులుగా పింఛన్‌ కొరకు తపాలా కార్యాలయానికి వస్తున్న ఆన్‌లైన్‌ సమస్య అంటూ కారణాలు చెపుతున్నాడని వాపోయారు. వరుసగా మూడు నెలలు పింఛన్‌ తీసుకోకపోతే పింఛన్‌ రద్దు అయ్యే అవకాశం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరిగి పింఛన్‌ పొందడానికి ఆరునెలల సమయం పడుతుందని తెలిపారు. సరైన సమయంలో పింఛన్‌ అందేలా చూస్తామని గ్రామ సర్పంచ్‌ దీపికా కిరణ్‌గౌడ్‌ హామీ ఇవ్వడంతో విరమించారు. సమస్యపై టెక్నికల్‌ అధికారులకు తెలపడం జరిగింది. శుక్రవారం సాయంత్రం వరకల్లా ఆన్‌లైన్‌ సమస్య పరిష్కరించి శనివారం ఉదయం వరకు లబ్దిదారులకు నగదు అందేలా చూస్తామని మండల అభివృద్ది అధికారి భరత్‌కుమార్‌ తెలిపారు.

Check Also

అందరికీ కృతజ్ఞతలు

నిజామాబాద్‌, జనవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం 6 కేంద్రాలలో ప్రారంభించుకున్న వ్యాక్సినేషన్‌ పూర్తిగా ఎక్కడ ...

Comment on the article