Breaking News

ఘనంగా వైకుంఠ ఏకాదశి

 

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా భక్తి శ్రద్దలతో జరుపుకున్నారు. జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఉదయమే భక్తులు ఉత్తర ద్వారం గుండా వైష్ణవ ఆలయాలకు వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నారు. జిల్లా కేంద్రంలోగల జెండా బాలాజీ ఆలయంలో ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని స్వామివారి గరుడవాహన సేవ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగర మేయర్‌ ఆకుల సుజాత తమ కుటుంబ సభ్యులతో హాజరై స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ వేడుకల్లో ఆలయ కమిటీ ఛైర్మన్‌ గోవింద్‌రాజు, ఇవో రవిందర్‌, ధర్మకర్తలు ప్రవీణ్‌కుమార్‌, కృష్ణవేణి, సంతోష్‌, సతీష్‌కుమార్‌గౌడ్‌, మోర సాయిలు, అర్చకులు నాగరాజు చారి, తదితరులు పాల్గొన్నారు.

Check Also

బోరుమోటారు ప్రారంభం

కామారెడ్డి, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 18 వ వార్డులోని అర్కల గల్లిలో బోర్‌ మోటార్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *