Breaking News

Daily Archives: December 30, 2017

తెలంగాణ పునర్నిర్మాణం విద్యార్థుల నుంచే జరగాలి

తెలంగాణ పునర్నిర్మాణం విద్యార్థుల నుంచే జరగాలన్నారు నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత. శనివారం నిజామాబాద్ జిల్లాలో  టెన్త్ ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ప్రేరణ పేరిట కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎంపి కవిత. స్ఠానిక అంబెడ్కర్ భవన్ లో యించార్జ్ కలెక్టర్ రవిందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంపి కవిత మాట్లాడుతూ గత ఏడాది జగిత్యాల జిల్లాలో ఉత్తేజం పేరిట టెన్త్ విద్యార్థుల కు ఒక గంట అడనఁగా భోదించడం వల్ల 98 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని కవిత తెలిపారు. జగిత్యాల జిల్లా రాష్ట్రములో నెంబర్1 ...

Read More »

2వ తేదీ నుంచి గ్రామ సభలు

  నిజాంసాగర్‌, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని ఆయా గ్రామాల్లో జనవరి 2వ తేదీ నుంచి గ్రామ సభలు నిర్వహిస్తున్నట్టు ఎంపిడివో రాములు నాయక్‌ తెలిపారు. 2న నర్వాలో, 3న అచ్చంపేట, మాగి, సింగీతం, కోమలంచ, మక్దుమ్‌పూర్‌, వెల్గనూరు, మల్లూరు గ్రామాల్లో గ్రామ సభలుంటాయన్నారు. 4న బంజేపల్లి, ఒడ్డేపల్లి, నర్సింగ్‌రావుపల్లి, ఆరేపల్లి, గాలిపూర్‌, సుంకిపల్లి గ్రామాల్లో సభలుంటాయని, 5న బూర్గుల్‌, హసన్‌పల్లి, గున్కుల్‌ గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. గ్రామ సభలకు గ్రామ స్థాయిలో ఉండే ...

Read More »

మోడల్‌ స్కూల్‌ వద్ద ఆర్టీసి బస్సులు ఆపాలి

  డిచ్‌పల్లి, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్‌పల్లిలో మాడల్‌ పాఠశాల ఏర్పాటై కొన్ని సంవత్సరాలు అవుతున్నా ఇక్కడ బస్టాప్‌ ఏర్పాటు అయినా కూడా ఆర్టీసి వారు బస్సులు నిలపడం లేదని పిడిఎస్‌యు నిజామాబాద్‌ డివిజన్‌ కమిటీ అధ్యక్షుడు సాయినాథ్‌ అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. అనంతరం సాయినాథ్‌ మాట్లాడుతూ ఆర్టీసి వారికి విద్యార్థులంటే చులకనగా ఉందని, విద్యార్థుల బస్సులో ప్రయాణం చేస్తే పాస్‌లు ఉంటాయి కాబట్టి టిక్కెట్టు తీసుకోరు కాబట్టి ఆర్డీసికి ...

Read More »

చెట్టుకు నిప్పు

  నిజాంసాగర్‌, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌- కామారెడ్డి ప్రధాన రహదారిలో బొగ్గుగుడిసె, నర్వా చౌరస్తా వద్ద ఓ భారీ వృక్షానికి గుర్తు తెలియని దుండగులు నిప్పంటించడంతో రోడ్డుపై భారీ వృక్షం పడిపోయింది. రహదారిపై ఆరీసి అధికారులు, వాహనదారులు అనేక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. సుమారు రెండు గంటల పాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రోడ్డు భవనాల శాఖాధికారులు, పోలీసు అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. కూలిన వృక్షాన్ని వెంటనే తొలగించాలనే ఆలోచన కూడా లేకుండాపోయిందని ఆందోళన వ్యక్తం ...

Read More »

జిల్లా యాదవ సంఘం కార్యదర్శిగా కిషన్‌

  బీర్కూర్‌, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అఖిలభారత యాదవ సంఘం కామారెడ్డి జిల్లా కార్యదర్శిగా కిషన్‌ యాదవ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు జిల్లా అధ్యక్షుడు అరికెల ప్రభాకర్‌ యాదవ్‌ తెలిపారు. ఈ సందర్భంగా నూతన కార్యదర్శిగా ఎన్నికైన సంగం కిషన్‌ యాదవ్‌ మాట్లాడుతూ జిల్లా అధ్యక్షుడు, పాలకవర్గం సహకారంతో తన ఎన్నికకు కృషి చేయడం జరిగిందన్నారు. తనపై నమ్మకం వుంచి పదవికి ఎన్నిక చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. జిల్లాలోని యాదవ సంఘాల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తానన్నారు. ...

Read More »

భూ ప్రక్షాళన వేగవంతం చేయండి

  బీర్కూర్‌, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని వేగవంతం చేయండని జిల్లా పాలనాధికారి సత్యనారాయణ అన్నారు. నసురుల్లాబాద్‌ మండలంలో నిర్వహిస్తున్న భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని శనివారం ఆయన తనికీ చేశారు. మండలంలో ఎన్ని గ్రామాలున్నాయి, భూ ప్రక్షాళన ఎన్ని గ్రామాల్లో జరిగింది, ఆన్‌లైన్‌రికార్డు ఎంత వరకు వచ్చిందని, ఎన్ని రోజుల్లో పని పూర్తిచేస్తారని ఆరాతీశారు. మూడురోజుల్లో పని పూర్తవుతుందని తహసీల్దార్‌ సంజీవ్‌రావు తెలిపారు. నిర్ణీత సమయంలో భూ రికార్డుల ప్రక్షాళన పూర్తి చేయాలని ...

Read More »

వెల్‌నెస్‌ సెంటర్‌ తనిఖీ చేసిన మంత్రి

  బీర్కూర్‌, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలం నెమ్లి గ్రామంలో ఇటీవల ప్రారంభించిన వెల్‌నెస్‌ సెంటర్‌, ఆరోగ్య కేంద్రాన్ని శనివారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు, రోగులకు అందుతున్న వైద్య సేవలపై సిబ్బందిని, ప్రజలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. వైద్యులు, సిబ్బంది ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని సూచించారు. త్వరలోనే వెల్‌నెస్‌ సెంటర్లో మరిన్ని వైద్యసౌకర్యాలు సమకూరుస్తామని మంత్రి హామీ ఇచ్చారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ...

Read More »

అర్హులైన నిరుపేదలకు రెండు పడక గదుల ఇల్లు

  – రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి బీర్కూర్‌, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అర్హులైన ప్రతి నిరుపేదకు రెండు పడక గదుల ఇల్లు అందిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. నసురుల్లాబాద్‌ మండల కేంద్రంలో మంజూరైన 40 డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించారు. అనంతరం నసురుల్లాబాద్‌ గ్రామంలో 4.20 లక్షలతో నిర్మించనున్న గిరిజన సంక్షేమ బాలుర పాఠశాల, 4.60 లక్షల రూపాయలతో నిర్మించనునన్న గిరిజన యువజన శిక్షణ కేంద్రం ...

Read More »

నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం బైక్‌ ర్యాలీ

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని దీనికి నిరసనగా నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోసం బైక్‌ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు బిజెవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గుండగోని భరత్‌గౌడ్‌ అన్నారు. శనివారం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన సిఎం కెసిఆర్‌ కేవలం వారి ఇంటికి మాత్రం నాలుగు ఉద్యోగాలు కల్పించుకున్న ఘనత ఆయనకు దక్కిందని అన్నారు. రాబోయే రోజుల్లో ...

Read More »

స్వచ్చభారత్‌లో పాల్గొన్న సిపి

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ శనివారం పోలీసు లైన్‌లో స్వచ్చభారత్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వయంగా కమీషనర్‌ పోలీసుక్వాటర్స్‌ వద్ద పేరుకుపోయిన చెత్త, చెదారం, ముళ్ల పొదలను తొలగించడం జరిగింది. ఈ సందర్భంగా కమీషనర్‌ మాట్లాడుతూ స్వచ్చభారత్‌లో ప్రతి ఒక్కరు పాల్గొని తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, పరిసరాలు శుభ్రంగా ఉన్నపుడే ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. ప్రతి ఒక్కరు స్వచ్చభారత్‌ను తమ బాధ్యతగా స్వీకరించి శ్రమదానం చేయాలని కమీషనర్‌ ...

Read More »

అభివృద్ది పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్త శనివారం నగరంలోని వినాయక్‌నగర్‌, బాబన్‌సాహబ్‌ పహాడ్‌లో జరుగుతున్న పలు రోడ్ల నిర్మాణాలను పరిశీలించారు. అలాగే నాగారంలో నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ళను కూడా పరిశీలించారు. దుబ్బ ప్రాంతంలో సెంటర్‌ పోల్స్‌ నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పనులు చేపట్టాలని, నాణ్యత విసయంలో రాజీపడవద్దని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.

Read More »

ప్రమాదకరమైన మత్తుపదార్థాలు స్వాధీనం

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కల్తీకల్లు ఉత్పత్తికి ఉపయోగించే అత్యంత ప్రమాదకరమైన డైజోఫామ్‌ను స్వాధీనం చేసుకున్నట్టు నిజామాబాద్‌ ఎక్సైజ్‌ ఎస్‌హెచ్‌వో మధుబాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 6.5 కిలోల డైజోఫామ్‌తోపాటు, 650 గ్రాముల ఆల్ఫజోలమ్‌ స్వాధీనం చేసుకున్నట్టు ఆయన తెలిపారు. వీటిని అక్రమంగా తరలిస్తున్న చందుగౌడ్‌, పెద్దబాలయ్య, సోమిరెడ్డి జితేందర్‌రెడ్డిని అదుపులోకి తీసుకొని ఎన్‌డిపిఎస్‌ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్టు తెలిపారు. దాడుల్లో కామారెడ్డి ఎక్సైజ్‌ సిఐ జాకీర్‌ఖాన్‌, ఎస్‌ఐ, సిబ్బంది పాల్గొన్నారు. ...

Read More »

జక్రాన్‌పల్లి నూతన గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రారంభోత్సవం

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లి మండలంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని నిజామాబాద్‌ పార్లమెంటు సభ్యురాలు కవిత శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిదులు కేటాయించి పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేస్తుందని అన్నారు. గ్రామాలు సుఖంగా ఉంటేనే పట్టణాలు సుఖంగా ఉంటాయని ఆమె తెలిపారు. నిజామాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో పాత గ్రామ పంచాయతీ భవనాలు గుర్తించి వాటి స్థానాల్లో ...

Read More »

ఫిల్టర్‌ బెడ్‌లో ప్రమాదం

– మునిసిపల్‌ కార్మికుని మృతి నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగర ఫిల్టర్‌ బెడ్‌లో శనివారం కెమికల్‌ బ్లాస్ట్‌ జరగడంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న భూమేశ్‌ అనే మునిసిపల్‌ కార్మికుడు మృతి చెందాడు. విషయం తెలుసుకున్న అర్బన్‌ ఎమ్మెల్యే గణేశ్‌ గుప్త సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. జరిగిన సంఘటన గురించి మునిసిపల్‌ అధికారులపై ఎమ్మెల్యే ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు, కార్మికులకు ముందస్తు సూచనలు, సలహాలు ఇవ్వాలని, అధికారుల నిర్లక్ష్యం వల్ల ...

Read More »

వ్యవసాయానికి నిరంతర విద్యుత్తు సరఫరా

  – ఎంపి కవిత నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వ్యవసాయ రంగానికి జనవరి 24 నుంచి నిరంతర విద్యుత్తు సరఫరా చేస్తామని నిజామాబాద్‌ ఎంపి కవిత పేర్కొన్నారు. శనివారం నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలోని జక్రాన్‌పల్లి మండలం మనోహరాబాద్‌ ప్రాథమికోన్నత పాఠశాల ఇంగ్లీష్‌ మీడియం విద్యార్థులకు అల్పాహారం అందించే కార్యక్రమాన్ని ప్రారంభించి ఎంపి మాట్లాడారు. జిల్లాలో 10వ తరగతి చదువుతున్న 11 వేల 500 మంది విద్యార్థులకు ప్రతిరోజు సాయంత్రం అత్యాల్పాహారం అందజేస్తామని,ఈ విషయంపై కలెక్టర్‌ కూడా ...

Read More »