Breaking News

ఫిల్టర్‌ బెడ్‌లో ప్రమాదం

– మునిసిపల్‌ కార్మికుని మృతి

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగర ఫిల్టర్‌ బెడ్‌లో శనివారం కెమికల్‌ బ్లాస్ట్‌ జరగడంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న భూమేశ్‌ అనే మునిసిపల్‌ కార్మికుడు మృతి చెందాడు. విషయం తెలుసుకున్న అర్బన్‌ ఎమ్మెల్యే గణేశ్‌ గుప్త సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. జరిగిన సంఘటన గురించి మునిసిపల్‌ అధికారులపై ఎమ్మెల్యే ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు, కార్మికులకు ముందస్తు సూచనలు, సలహాలు ఇవ్వాలని, అధికారుల నిర్లక్ష్యం వల్ల ఓ నిండు ప్రాణం బలైందని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి సానుభూతి తెలిపారు. మృతుని భార్యకు మునిసిపాలిటిలో ఉద్యోగంతోపాటు వారి పిల్లలను గురుకుల పాఠశాలలో చేర్పించి చదువుకు సహకరిస్తామని, ప్రభుత్వంతో మాట్లాడి డబుల్‌ బెడ్‌ రూం ఇల్లు మంజూరు చేస్తామని, అదేవిధంగా వచ్చేనెల మొదటి వారంలో జరిగే స్టాండింగ్‌ కమిటీ మీటింగ్‌లో చర్చించి ఆర్థిక సాయం అందించి ఆదుకుంటామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

Check Also

మండల‌ జర్నలిస్టుల‌ కార్యవర్గం ఎన్నిక

నిజాంసాగర్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాయంలో జర్నలిస్టుల‌ సమావేశం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *