Breaking News

నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం బైక్‌ ర్యాలీ

 

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని దీనికి నిరసనగా నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోసం బైక్‌ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు బిజెవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గుండగోని భరత్‌గౌడ్‌ అన్నారు. శనివారం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన సిఎం కెసిఆర్‌ కేవలం వారి ఇంటికి మాత్రం నాలుగు ఉద్యోగాలు కల్పించుకున్న ఘనత ఆయనకు దక్కిందని అన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో నిరుపేదల సమస్యలపై అతిపెద్ద బైక్‌ ర్యాలీ నిర్వహించబోతున్నట్టు ఆయన తెలిపారు. కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి, అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో బిజెవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజేశ్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రవీణ్‌రెడ్డి, బిజెవైఎం జిల్లా అధ్యక్షుడు న్యాలం రాజు, ప్రవీణ్‌రెడ్డి, బిజెపి జిల్లాసంఘటన మంత్రి రమేశ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శులు శివప్రసాద్‌, పోల్కం వేణు, నరేశ్‌, దేవేందర్‌, రోషన్‌, జశ్వంత్‌, శ్రీకాంత్‌గౌడ్‌, బాలు, భాస్కర్‌, సంతోష్‌, సుమన్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

పారిశుద్య పనులు పర్యవేక్షించిన నగర మేయర్‌

నిజామాబాద్‌, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని జోన్‌ 1 పరిదిలోని 37వ డివిజన్‌, 16వ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *