Breaking News

మోడల్‌ స్కూల్‌ వద్ద ఆర్టీసి బస్సులు ఆపాలి

 

డిచ్‌పల్లి, డిసెంబర్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్‌పల్లిలో మాడల్‌ పాఠశాల ఏర్పాటై కొన్ని సంవత్సరాలు అవుతున్నా ఇక్కడ బస్టాప్‌ ఏర్పాటు అయినా కూడా ఆర్టీసి వారు బస్సులు నిలపడం లేదని పిడిఎస్‌యు నిజామాబాద్‌ డివిజన్‌ కమిటీ అధ్యక్షుడు సాయినాథ్‌ అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. అనంతరం సాయినాథ్‌ మాట్లాడుతూ ఆర్టీసి వారికి విద్యార్థులంటే చులకనగా ఉందని, విద్యార్థుల బస్సులో ప్రయాణం చేస్తే పాస్‌లు ఉంటాయి కాబట్టి టిక్కెట్టు తీసుకోరు కాబట్టి ఆర్డీసికి డబ్బులు రావనేభావనతో బస్సులు ఆపడం లేదని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో వరుణ్‌, విజయ్‌, గణేశ్‌, సాయి, పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు.

Check Also

పెండింగ్‌ మ్యుటేషన్‌ల ప్రతిపాదనలో జాగ్రత్తగా పంపండి

నిజామాబాద్‌, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ఆదేశించిన ప్రకారం పెండింగ్‌లో ఉన్న మ్యుటేషన్‌లను క్లియర్‌ ...

Comment on the article