Breaking News

వ్యవసాయానికి నిరంతర విద్యుత్తు సరఫరా

 

– ఎంపి కవిత

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వ్యవసాయ రంగానికి జనవరి 24 నుంచి నిరంతర విద్యుత్తు సరఫరా చేస్తామని నిజామాబాద్‌ ఎంపి కవిత పేర్కొన్నారు. శనివారం నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలోని జక్రాన్‌పల్లి మండలం మనోహరాబాద్‌ ప్రాథమికోన్నత పాఠశాల ఇంగ్లీష్‌ మీడియం విద్యార్థులకు అల్పాహారం అందించే కార్యక్రమాన్ని ప్రారంభించి ఎంపి మాట్లాడారు. జిల్లాలో 10వ తరగతి చదువుతున్న 11 వేల 500 మంది విద్యార్థులకు ప్రతిరోజు సాయంత్రం అత్యాల్పాహారం అందజేస్తామని,ఈ విషయంపై కలెక్టర్‌ కూడా చొరవ తీసుకుంటున్నారని ఆమె ప్రకటించారు. అన్నపూర్ణ బ్రేక్‌ఫాస్ట్‌ సర్వీసెస్‌ను నిర్వహిస్తున్న సత్యసాయి సేవా ట్రస్టును ఈ సందర్భంగా ఎంపి అభినందించారు.

మంచి కార్యక్రమంలో పాల్గొనే అదృష్టం కలిగినందుకు సంతోషంగా ఉందన్నారు. జిల్లా అంతటా అల్పాహారం అందించేలా ప్రణాళికలు రూపొందించాలని హెల్పింగ్‌ హ్యాండ్‌ సంస్థను ఎంపి కోరారు. భూ ప్రక్షాళన కార్యక్రమం వేగంగా జరుగుతుందని, ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్దికి ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రత్యేక నిదులు అందజేస్తున్నారని, కెసిఆర్‌ కిట్‌ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరి అయితే రూ. 12 వేలు, ఆడపిల్ల పుడితే రూ. 13 వేలు అందజేస్తున్నారని అన్నారు. 1200 జనాబా ఉన్న మనోహరాబాద్‌ గ్రామంలో ప్రభుత్వం 30 కోట్లు ఖర్చు చేసిందని కవిత పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ నిరంతరం బడుగు, బలహీన వర్గాల గురించి ఆలోచిస్తున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే రైతులకు ఎలాంటి నీటి ఇబ్బందులు ఉండవని, మునిపల్లి పథకం ద్వారా ఈ ప్రాంత రైతులకు నీరు అందుతుందని ఎంపి కవిత పేర్కొన్నారు. కార్యక్రమంలో నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌, ఇన్‌చార్జి కలెక్టర్‌ రవిందర్‌రెడ్డి, డిసిఎంఎస్‌ ఛైర్మన్‌ ముజీబుద్దీన్‌, జక్రాన్‌పల్లి జడ్పిటిసి తనుజ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపిపి పెద్ద రాజన్న, బాజిరెడ్డి జగన్‌, సర్పంచ్‌ తిరుపతిరెడ్డి, ఎంపిటిసిలు, వార్డు సభ్యులు, సత్యసాయి సేవా ట్రస్టు నిర్వాహకులు శ్రీకాంత్‌, హెల్పింగ్‌ హ్యాండ్స్‌ ప్రతినిధి రమణారెడ్డి పాల్గొన్నారు.

Check Also

యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలని సమాచార శాఖ డిప్యుటి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *