Breaking News

స్వచ్చభారత్‌లో పాల్గొన్న సిపి

 

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ శనివారం పోలీసు లైన్‌లో స్వచ్చభారత్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వయంగా కమీషనర్‌ పోలీసుక్వాటర్స్‌ వద్ద పేరుకుపోయిన చెత్త, చెదారం, ముళ్ల పొదలను తొలగించడం జరిగింది. ఈ సందర్భంగా కమీషనర్‌ మాట్లాడుతూ స్వచ్చభారత్‌లో ప్రతి ఒక్కరు పాల్గొని తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, పరిసరాలు శుభ్రంగా ఉన్నపుడే ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. ప్రతి ఒక్కరు స్వచ్చభారత్‌ను తమ బాధ్యతగా స్వీకరించి శ్రమదానం చేయాలని కమీషనర్‌ సూచించారు. ఈ సందర్భంగా పోలీసు లైన్‌లోని పిల్లల పార్కు, స్పోర్ట్స్‌ యూనిట్‌, ఆసుపత్రి, ప్రధాన రోడ్లు, క్వాటర్స్‌ చుట్టుపక్కల పిచ్చిమొక్కలను, ముళ్ల పొదలను సిబ్బందితో శుభ్రం చేయించారు. కార్యక్రమంలో అదనపు డిసిపి ఆకుల రాంరెడ్డి, నిజామాబాద్‌ ఎన్‌ఐబి ఏసిపిలు సుదర్శన్‌, జి. రవీందర్‌, రిజర్వు ఇన్స్‌పెక్టర్‌ మల్లికార్జున్‌, నిజామాబాద్‌ పోలీసు యూనిట్‌ డాక్టర్‌ అశోక్‌, ఆర్‌ఎస్‌ఐలు, ఏఆర్‌ ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

ఫిట్‌ ఇండియా లక్ష్యంగా క్రీడా పోటీలు

బీర్కూర్‌, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని సంగం తండాలో సేవా సంఘ్‌ ఫ్రెండ్స్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *