Breaking News

అర్హులైన నిరుపేదలకు రెండు పడక గదుల ఇల్లు

 

– రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి

బీర్కూర్‌, డిసెంబర్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అర్హులైన ప్రతి నిరుపేదకు రెండు పడక గదుల ఇల్లు అందిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. నసురుల్లాబాద్‌ మండల కేంద్రంలో మంజూరైన 40 డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించారు. అనంతరం నసురుల్లాబాద్‌ గ్రామంలో 4.20 లక్షలతో నిర్మించనున్న గిరిజన సంక్షేమ బాలుర పాఠశాల, 4.60 లక్షల రూపాయలతో నిర్మించనునన్న గిరిజన యువజన శిక్షణ కేంద్రం పనుల నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ అర్హులైన ప్రతి నిరుపేదకు రెండు పడక గదుల ఇల్లు అందించి తెరాస ప్రభుత్వ ధ్యేయమన్నారు. గ్రామంలో 72 మంది లబ్దిదారులను గుర్తించామని మరో 32 మందికి రెండవ విడతలో ఇళ్ల నిర్మాణం చేపడతామని తెలిపారు.

దసరా లోపు రెండు పడక గదుల ఇల్లు నిర్మాణం పూర్తవుతుందని అన్నారు. నసురుల్లాబాద్‌ గ్రామంలో నిర్మించే గిరిజన సంక్షేమ బాలుర పాఠశాల, గిరిజన యువజ న శిక్షణ కేంద్రం జూన్‌ మాసం కల్లా పూర్తిచేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. పాఠశాలలో 5వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు విద్య బోధన జరుగుతుందని తెలిపారు. గిరిజన యువజన శిక్షణ కేంద్రంలో భోజన వసతితోపాటు 400 మందికి వివిధ ఉద్యోగ రంగాల్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ పెరిక శ్రీనివాస్‌, ఎంపిపి మల్లెల మీణ హన్మంతు, ఆర్డీవో రాజేశ్వర్‌, సర్పంచ్‌ అరిగె సాయిలు, ఎంపిటిసి కంది మల్లేశం, జడ్పిటిసి కిషన్‌ నాయక్‌, తెరాస కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

Check Also

యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలని సమాచార శాఖ డిప్యుటి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *