Breaking News

చెట్టుకు నిప్పు

 

నిజాంసాగర్‌, డిసెంబర్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌- కామారెడ్డి ప్రధాన రహదారిలో బొగ్గుగుడిసె, నర్వా చౌరస్తా వద్ద ఓ భారీ వృక్షానికి గుర్తు తెలియని దుండగులు నిప్పంటించడంతో రోడ్డుపై భారీ వృక్షం పడిపోయింది. రహదారిపై ఆరీసి అధికారులు, వాహనదారులు అనేక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. సుమారు రెండు గంటల పాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రోడ్డు భవనాల శాఖాధికారులు, పోలీసు అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. కూలిన వృక్షాన్ని వెంటనే తొలగించాలనే ఆలోచన కూడా లేకుండాపోయిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బొగ్గుగుడిసె- ఎల్లారెడ్డి రహదారి వెంట రోడ్డు వెడల్పు పనులు జరుగుతున్నా రోడ్డు భవనాల శాఖాధికారులు పర్యవేక్షించడం లేదని అంటున్నారు.

Check Also

డిమాండ్‌ ఉన్న పంటలు వేస్తే ఈజీగా అమ్ముకోవచ్చు…

ఆర్మూర్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ రైతు రాష్ట్రంలోని ఇతర ప్రాంత రైతుల‌కు ఆదర్శవంతంగా ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *