Breaking News

ప్రమాదకరమైన మత్తుపదార్థాలు స్వాధీనం

 

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కల్తీకల్లు ఉత్పత్తికి ఉపయోగించే అత్యంత ప్రమాదకరమైన డైజోఫామ్‌ను స్వాధీనం చేసుకున్నట్టు నిజామాబాద్‌ ఎక్సైజ్‌ ఎస్‌హెచ్‌వో మధుబాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 6.5 కిలోల డైజోఫామ్‌తోపాటు, 650 గ్రాముల ఆల్ఫజోలమ్‌ స్వాధీనం చేసుకున్నట్టు ఆయన తెలిపారు. వీటిని అక్రమంగా తరలిస్తున్న చందుగౌడ్‌, పెద్దబాలయ్య, సోమిరెడ్డి జితేందర్‌రెడ్డిని అదుపులోకి తీసుకొని ఎన్‌డిపిఎస్‌ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్టు తెలిపారు. దాడుల్లో కామారెడ్డి ఎక్సైజ్‌ సిఐ జాకీర్‌ఖాన్‌, ఎస్‌ఐ, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం నిందితులను నిజామాబాద్‌ ఎక్సైజ్‌ డిప్యూటి కమీషనర్‌ డేవిడ్‌ రవికాంత్‌ ఆధ్వర్యంలో మీడియా ముందు ప్రవేశపెట్టారు.

Check Also

యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలని సమాచార శాఖ డిప్యుటి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *