Breaking News

జిల్లా యాదవ సంఘం కార్యదర్శిగా కిషన్‌

 

బీర్కూర్‌, డిసెంబర్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అఖిలభారత యాదవ సంఘం కామారెడ్డి జిల్లా కార్యదర్శిగా కిషన్‌ యాదవ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు జిల్లా అధ్యక్షుడు అరికెల ప్రభాకర్‌ యాదవ్‌ తెలిపారు. ఈ సందర్భంగా నూతన కార్యదర్శిగా ఎన్నికైన సంగం కిషన్‌ యాదవ్‌ మాట్లాడుతూ జిల్లా అధ్యక్షుడు, పాలకవర్గం సహకారంతో తన ఎన్నికకు కృషి చేయడం జరిగిందన్నారు. తనపై నమ్మకం వుంచి పదవికి ఎన్నిక చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. జిల్లాలోని యాదవ సంఘాల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తానన్నారు. ఆయన ఎన్నికపట్ల బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గ యాదవ సంఘం సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

Check Also

ఫిట్‌ ఇండియా లక్ష్యంగా క్రీడా పోటీలు

బీర్కూర్‌, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని సంగం తండాలో సేవా సంఘ్‌ ఫ్రెండ్స్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *