Breaking News

భూ ప్రక్షాళన వేగవంతం చేయండి

 

బీర్కూర్‌, డిసెంబర్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని వేగవంతం చేయండని జిల్లా పాలనాధికారి సత్యనారాయణ అన్నారు. నసురుల్లాబాద్‌ మండలంలో నిర్వహిస్తున్న భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని శనివారం ఆయన తనికీ చేశారు. మండలంలో ఎన్ని గ్రామాలున్నాయి, భూ ప్రక్షాళన ఎన్ని గ్రామాల్లో జరిగింది, ఆన్‌లైన్‌రికార్డు ఎంత వరకు వచ్చిందని, ఎన్ని రోజుల్లో పని పూర్తిచేస్తారని ఆరాతీశారు. మూడురోజుల్లో పని పూర్తవుతుందని తహసీల్దార్‌ సంజీవ్‌రావు తెలిపారు. నిర్ణీత సమయంలో భూ రికార్డుల ప్రక్షాళన పూర్తి చేయాలని ఆదేశించారు. ఆర్డీవో రాజేశ్వర్‌, డిటి ఉమాలత, పెరక శ్రీనివాస్‌, రెవెన్యూ అధికారులున్నారు.

Check Also

బోరుమోటారు ప్రారంభం

కామారెడ్డి, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 18 వ వార్డులోని అర్కల గల్లిలో బోర్‌ మోటార్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *