Breaking News

వెల్‌నెస్‌ సెంటర్‌ తనిఖీ చేసిన మంత్రి

 

బీర్కూర్‌, డిసెంబర్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలం నెమ్లి గ్రామంలో ఇటీవల ప్రారంభించిన వెల్‌నెస్‌ సెంటర్‌, ఆరోగ్య కేంద్రాన్ని శనివారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు, రోగులకు అందుతున్న వైద్య సేవలపై సిబ్బందిని, ప్రజలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. వైద్యులు, సిబ్బంది ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని సూచించారు. త్వరలోనే వెల్‌నెస్‌ సెంటర్లో మరిన్ని వైద్యసౌకర్యాలు సమకూరుస్తామని మంత్రి హామీ ఇచ్చారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.

Check Also

యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలని సమాచార శాఖ డిప్యుటి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *