Breaking News

జక్రాన్‌పల్లి నూతన గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రారంభోత్సవం

 

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లి మండలంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని నిజామాబాద్‌ పార్లమెంటు సభ్యురాలు కవిత శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిదులు కేటాయించి పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేస్తుందని అన్నారు. గ్రామాలు సుఖంగా ఉంటేనే పట్టణాలు సుఖంగా ఉంటాయని ఆమె తెలిపారు. నిజామాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో పాత గ్రామ పంచాయతీ భవనాలు గుర్తించి వాటి స్థానాల్లో కొత్త భవనాలు నిర్మిస్తున్నామని ఎంపి వివరించారు. కార్యక్రమంలో నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌, జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ రవిందర్‌రెడ్డి, ఎంపిటిసిలు, జడ్పిటిసిలు తదితరులు పాల్గొన్నారు.

Check Also

పారిశుద్య పనులు పర్యవేక్షించిన నగర మేయర్‌

నిజామాబాద్‌, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని జోన్‌ 1 పరిదిలోని 37వ డివిజన్‌, 16వ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *