Breaking News

తెలంగాణ పునర్నిర్మాణం విద్యార్థుల నుంచే జరగాలి

తెలంగాణ పునర్నిర్మాణం విద్యార్థుల నుంచే జరగాలన్నారు నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత. శనివారం నిజామాబాద్ జిల్లాలో  టెన్త్ ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ప్రేరణ పేరిట కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎంపి కవిత. స్ఠానిక అంబెడ్కర్ భవన్ లో యించార్జ్ కలెక్టర్ రవిందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంపి కవిత మాట్లాడుతూ గత ఏడాది జగిత్యాల జిల్లాలో ఉత్తేజం పేరిట టెన్త్ విద్యార్థుల కు ఒక గంట అడనఁగా భోదించడం వల్ల 98 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని కవిత తెలిపారు.
జగిత్యాల జిల్లా రాష్ట్రములో నెంబర్1 గా నిలిచింది అని చెప్పారు. ప్రేరణ కార్యక్రమం ద్వారా నిజామాబాద్ నెంబర్1 స్థానంలో నిలవాలని, ఆ గురుతర బాధ్యత ప్రధానోపాధ్యాయులు మోయాలని కోరారు.
టెన్త్వి ద్యార్థుల కు మూడు నెలల పాటు రోజూ సాయంత్రం స్నాక్స్ అందించే కార్యక్రమంను కవిత ప్రారంభించారు. ఇటీవల జరిగిన జిల్లా అభివృద్ధి సమన్వయ కమిటీ సమావేశంలో విద్య పై జరిగిన సమీక్ష సందర్బంగా ఎంపి కవిత టెన్త్ విద్యార్థులు కు స్నాక్స్ పెడితే  ఉపయోగకరంగా ఉంటుందని కలెక్టర్ తో ఎంపీ కవిత అన్నారు.
ఈ నేపథ్యంలో స్నాక్స్ కార్యక్రమం రూపుదాల్చింది. మొత్తం రూ.26 లక్షలు వ్యయం అవుతుందని విద్యా శాఖ అంచనా వేసింది.
జనవరి నెల నిర్వహణ కోసం రూ.10 లక్షలు విడుదల అయ్యాయి.చెక్ లను నిజామాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి నాంపల్లి రాజేశ్ కు ఎంపి కవిత అందజేశారు.అంతకు ముందు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గము పరిధిలో జక్రాన్ పల్లి మండలం మనోహరాబాద్ లోని ప్రాథమికోన్నత పాఠశాల లో విద్యార్థులకు ఉదయం పూట అల్పాహారం అందించే కార్యక్రమాన్ని ఎంపీ కవిత ప్రారంభించారు. ఒక విద్యార్థికి అల్పాహారం ను తానే స్వయంగా తినిపించారు. సత్యసాయి సేవా ట్రస్టు, హెల్పింగ్ హ్యాండ్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి.
ఎంపీ కవిత, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ లు మండలంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లలో అల్పాహారం అందజేసేందు కు ఆ సంస్థలు అంగీకరించాయి.
తర్వాత జక్రాన్ పల్లి లోని ప్రభుత్వ మోడల్ స్కూల్, జూనియర్ కాలేజీ ప్రాంగణంలో ఉద్యార్థినిల హాస్టల్ భవన సముదాయమును ఎంపీ కవిత ప్రారంభించారు. మధ్యాహ్న భోజనం నాణ్యతను పరీక్షించారు. విద్యార్థినీలతో కలసి భోజనం  చేశారు. విద్య ప్రాముఖ్యతను వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ  స్కూల్ లను ఆభివృద్ది చేస్తున్న తీరును ఎంపీ కవిత వివరించారు.

Check Also

ఫిట్‌ ఇండియా లక్ష్యంగా క్రీడా పోటీలు

బీర్కూర్‌, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని సంగం తండాలో సేవా సంఘ్‌ ఫ్రెండ్స్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *