Breaking News

2వ తేదీ నుంచి గ్రామ సభలు

 

నిజాంసాగర్‌, డిసెంబర్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని ఆయా గ్రామాల్లో జనవరి 2వ తేదీ నుంచి గ్రామ సభలు నిర్వహిస్తున్నట్టు ఎంపిడివో రాములు నాయక్‌ తెలిపారు. 2న నర్వాలో, 3న అచ్చంపేట, మాగి, సింగీతం, కోమలంచ, మక్దుమ్‌పూర్‌, వెల్గనూరు, మల్లూరు గ్రామాల్లో గ్రామ సభలుంటాయన్నారు. 4న బంజేపల్లి, ఒడ్డేపల్లి, నర్సింగ్‌రావుపల్లి, ఆరేపల్లి, గాలిపూర్‌, సుంకిపల్లి గ్రామాల్లో సభలుంటాయని, 5న బూర్గుల్‌, హసన్‌పల్లి, గున్కుల్‌ గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. గ్రామ సభలకు గ్రామ స్థాయిలో ఉండే అన్ని శాఖలకు చెందిన అధికారులతో పాటు గ్రామస్తులు హాజరుకావాలని కోరారు. గ్రామ సమస్యల గురించి సభలో చర్చిస్తే సమస్యలు పరిష్కారమవుతాయని పేర్కొన్నారు.

Check Also

సమ్మెకు పిడిఎస్‌యు మద్దతు

నిజామాబాద్‌, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ, నవంబర్‌ 26న జరిగే ...

Comment on the article