Breaking News

Daily Archives: December 31, 2017

వైభవంగా అయ్యప్ప ఆరట్టు

  గాంధారి, డిసెంబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండల కేంద్రంలో ఆదివారం అయ్యప్పస్వామి ఆరట్టు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక అయ్యప్ప స్వామి ఆలయం నుండి ప్రత్యేకంగా అలంకరించిన రథంపై అయ్యప్పస్వామి విగ్రహాన్ని ఊరేగించారు. మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా అయ్యప్ప శోభాయాత్ర కొనసాగింది. అయ్యప్ప నామస్మరణతో శరణుఘోష నినాదాలతో ప్రధాన వీధులన్ని మారుమోగాయి. అయ్యప్ప ఆరట్టు శోభాయాత్ర కొనసాగినంత వరకు భక్తులు స్వామివారిని స్మరించారు. కన్నెస్వాములు నృత్యాలు చేస్తు వివిధ వేషధారణలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ...

Read More »

పదవీ విరమణ పొందిన రూరల్‌ ఎస్‌ఐ

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రూరల్‌ పోలీసు స్టేషన్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న సీతారాం రాథోడ్‌ ఆదివారం పదవీ విరమణ పొందారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్‌ ఏసిపి సుదర్శన్‌ హజరై మాట్లాడారు. పదవీ విరమణ అనేది ప్రతి ఉద్యోగికి మంచి జ్ఞాపకం లాంటిదని రాథోడ్‌ శేషజీవితం సుఖ సంతోషాలతో గడపాలని అన్నారు. కార్యక్రమంలో రూరల్‌ సిఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐలు శ్రీధర్‌గౌడ్‌, లక్ష్మయ్య, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Read More »

ప్రజలకు పోలీసులు ఆప్తబంధువులుగా మారాలి

  – డిజిపి మహేందర్‌రెడ్డి కామారెడ్డి, డిసెంబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలోని అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో ప్రజలకు పోలీసు ఆప్తబంధువులుగా మారి కృసిచేయాలని డిజిపి మహేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయానికి చేరుకున్న ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలీసు సేవలపై కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. వెస్ట్‌ జోన్‌ పరిధిలో భాగంగా కామారెడ్డి జిల్లాకు రావడం జరిగిందన్నారు. శాంతిభద్రతలు తగ్గుముఖం పట్టేందుకు పోలీసుశాఖ కృషి చేస్తుందన్నారు. ఆయా పోలీసు స్టేషన్‌లలో ఫిర్యాదుదారులతో మాట్లాడి పోలీసు అధికారుల ...

Read More »

చంద్రనగర్‌లో మతమార్పిడిల అలజడి

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలో చంద్రనగర్‌ ప్రాంతంలో ఆదివారం ఉదయం ఒక మతానికి చెందినవారు ఇతర మతాల పిల్లలకు వారింట్లోకి పిలిచి ప్రార్థనలు చేయాలని సూచిస్తూ వారి మతాలకు సంబంధించిన పుస్తకాలు ఇవ్వడంతోపాటు ప్రతిరోజు చదవాలని పిల్లలను బలవంతం చేశారు. పిల్లలు ఈ విషయాన్ని ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులకు తెలపగా కాలనీ వాసులు వెళ్ళి సదరు వ్యక్తులను ప్రశ్నించగా సరిగా స్పందించకపోవడంతో 4వ టౌన్‌ పోలీసులను ఆశ్రయించారు. ఈ విషయంపై పోలీసులు ...

Read More »

బ్రాహ్మణ సమాజ కాలసూచి ఆవిష్కరణ

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బ్రాహ్మణ సంక్షేమం కోసం నిరంతరం కృసి చేస్తుందని, ఆ సంక్షేమ ఫలాలు అందరికి చేరవేయడానికి బ్రాహ్మణ సమాజం ముందుంటుందని జిల్లా అధ్యక్షుడు జనగామ చంద్రశేఖర శర్మ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోగల గీతాభవనంలో జిల్లా మనబ్రాహ్మణ సమాజం 2018 క్యాలెండర్‌ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సమాజం గౌరవ అధ్యక్షుడు మేడిచర్ల ప్రభాకర్‌రావు మాట్లాడుతూ బ్రాహ్మణ సమాజానికి రాష్ట్ర ప్రభుత్వం మంచి ప్రాధాన్యత ...

Read More »

షీ టీంల పనితీరు భేష్‌

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీసు కమీషనరేట్‌ పరిధిలో నిజామాబాద్‌, ఆర్మూర్‌, బోధన్‌ డివిజన్‌లలో షీ టీంల పనితీరు భేషుగ్గా ఉందని నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం 6 షీ టీంలు ఏర్పాటు చేసి వారికి ఇన్‌చార్జిగా ఇన్స్‌పెక్టర్‌ స్తాయి అదికారిని నియమించడం జరిగిందని, ప్రతి షీ టీంలో ఒక ఎస్‌ఐ స్థాయి అధికారి, ఇద్దరు మహిళా పోలీసు కానిస్టేబుళ్లు, ఇద్దరు కానిస్టేబుళ్ళతో ఒక బృందంగా పనిచేస్తున్నారని, వీరు ...

Read More »

సోమవారం డయల్‌ యువర్‌ సిపి

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీసు కమీషనరేట్‌ పరిధిలో ప్రతి సోమవారం నిర్వహించే డయల్‌ యువర్‌ సిపి కార్యక్రమం యధావిధిగా కొనసాగుతుందని పోలీసు కమీషనర్‌ కార్తికేయ ఒక ప్రకటనలో తెలిపారు. కమీషనరేట్‌ పరిధిలోని బోధన్‌, ఆర్మూర్‌తో పాటు నిజామాబాద్‌ డివిజన్‌లకు చెందిన ప్రజలు తమ పిర్యాదులను 08462-228433 నెంబర్‌కు ఫోన్‌ చేసి తమ సమస్యలను తెలియజేయాలని, ఫోన్‌ చేసే సమయంలో ఎలాంటి శబ్దం లేకుండా చూసుకోవాలని, సమయ పాలన పాటించి ఇతరులకు కూడా అవకాశం ...

Read More »

హైడ్రోజన్‌ బెలూన్స్‌పై సమాచారం ఇవ్వండి

  – సిపి కార్తికేయ నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టాటా ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌ వారి ఆధ్వర్యంలో గాలిలో తేలే బెలూన్స్‌ (పారాషూట్స్‌) హైదరాబాద్‌ నుంచి ప్రయోగించడం జరిగిందని, ఇందులో భాగంగా పారాషూట్స్‌ గాలిలో ఎగిరిన తర్వాత 30 నుంచి 42 కి.మీ.ల ఎత్తు వరకు, 200 నుంచి 350 కి.మీ.ల వరకు రావడం జరుగుతుందని, 20 నుంచి 40 మీటర్ల పొడవుతో తాళ్లు ఉంటాయని, భూమిమీదకు దిగేముందు నెమ్మదిగా దిగుతాయని నిజామాబాద్‌ పోలీసు ...

Read More »

జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

  – సిపి కార్తికేయ నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ కమీషనరేట్‌ పరిధిలోని ప్రజలందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కమీషనర్‌ మాట్లాడుతూ ప్రజలందరు నూతన సంవత్సర వేడుకలను శాంతియుతంగా జరుపుకోవాలని, ఎలాంటి వివాదాలకు తావులేకుండా ఆనందంగా పండుగ జరుపుకొని, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులకు సహకరించాలని కమీషనర్‌ సూచించారు.

Read More »

నూతన సంవత్సరంలో ప్రజలందరు బాగుండాలి

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నూతన సంవత్సరంలో ప్రజలందరు బాగుండాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రాష్ట్రప్రజలు, జిల్లా ప్రజలు కొత్త సంవత్సరంలో సుఖ సంతోషాలు కలగాలని, మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మంత్రి ఆకాంక్షించారు. తెలంగాణ వ్యవసాయ రంగానికి 2017 ఒక మైలురాయి అని, దేశంలో మొట్టమొదటిసారిగా మన రాష్ట్ర రైతులకు ముందస్తు పెట్టుబడిగా ఎకరానికి రూ. 4 వేలు ప్రకటించి 2017లోనే, 1932లో నిజాంహయాంలో జరిపిన భూ కొలతల ...

Read More »

చెక్కులు పంపిణీ చేసిన రూరల్‌ ఎమ్మెల్యే

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ ఆదివారం రూరల్‌ నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిది చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు బాధితులకు అందడం అంటే అందని ద్రాక్షగా మిగిలేదని, కానీ ముఖ్యమంత్రి కెసిఆర్‌ తన పాలనలో సిఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను త్వరితగతిన బాధితులకు అందేలా చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. లబ్దిదారులు గంగుకు లక్ష ...

Read More »

నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా ప్రజలకు మిషన్‌ భగీరథ వైస్‌ఛైర్మన్‌, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరు 2018 కొత్త సంవత్సరంలో మంచి జరగాలని, వర్షాలు బాగా కురిసి రైతాంగానికి మేలు జరగాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ తనపై నమ్మకంతో అప్పగించిన మిషన్‌ భగీరథ పనులు అధికారులు, ప్రజల సహకారంతో పూర్తిచేసి ప్రతి ఇంటికి సురక్షిత మంచినీటిని అందిస్తామని ఆయన తెలిపారు.

Read More »