Breaking News

వైభవంగా అయ్యప్ప ఆరట్టు

 

గాంధారి, డిసెంబర్‌ 31

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండల కేంద్రంలో ఆదివారం అయ్యప్పస్వామి ఆరట్టు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక అయ్యప్ప స్వామి ఆలయం నుండి ప్రత్యేకంగా అలంకరించిన రథంపై అయ్యప్పస్వామి విగ్రహాన్ని ఊరేగించారు. మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా అయ్యప్ప శోభాయాత్ర కొనసాగింది. అయ్యప్ప నామస్మరణతో శరణుఘోష నినాదాలతో ప్రధాన వీధులన్ని మారుమోగాయి. అయ్యప్ప ఆరట్టు శోభాయాత్ర కొనసాగినంత వరకు భక్తులు స్వామివారిని స్మరించారు. కన్నెస్వాములు నృత్యాలు చేస్తు వివిధ వేషధారణలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆరట్టుకు మహిళలు ఘనంగా స్వాగతం పలికి హారతులిచ్చారు. ప్రతియేడు డిసెంబరు 31న గాంధారి మండల కేంద్రంలో అయ్యప్ప ఆరట్టు నిర్వహిస్తారు.

Check Also

యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలని సమాచార శాఖ డిప్యుటి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *