Breaking News

బ్రాహ్మణ సమాజ కాలసూచి ఆవిష్కరణ

 

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 31

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బ్రాహ్మణ సంక్షేమం కోసం నిరంతరం కృసి చేస్తుందని, ఆ సంక్షేమ ఫలాలు అందరికి చేరవేయడానికి బ్రాహ్మణ సమాజం ముందుంటుందని జిల్లా అధ్యక్షుడు జనగామ చంద్రశేఖర శర్మ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోగల గీతాభవనంలో జిల్లా మనబ్రాహ్మణ సమాజం 2018 క్యాలెండర్‌ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సమాజం గౌరవ అధ్యక్షుడు మేడిచర్ల ప్రభాకర్‌రావు మాట్లాడుతూ బ్రాహ్మణ సమాజానికి రాష్ట్ర ప్రభుత్వం మంచి ప్రాధాన్యత ఇస్తుందని, ఇంకా పలు ప్రాంతాల్లో బ్రాహ్మణులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారిని గుర్తించి ఆర్థికంగా చేయూతనివ్వాలని ప్రబుత్వాన్ని కోరారు. ఆవిష్కరణ కార్యక్రమంలో తిరుపతి సుభాష్‌రావు, ప్రకాశ్‌ శర్మ, చంద్రమౌళి శర్మ తదితరులున్నారు.

Check Also

ప్రభుత్వ సూచన మేరకు రైతులు పంటలు వేయాలి

నిజామాబాద్‌, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి సూచన ప్రకారం రాబోయే వానాకాలంలో వ్యవసాయ అధికారులు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *