Breaking News

హైడ్రోజన్‌ బెలూన్స్‌పై సమాచారం ఇవ్వండి

 

– సిపి కార్తికేయ

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 31

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టాటా ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌ వారి ఆధ్వర్యంలో గాలిలో తేలే బెలూన్స్‌ (పారాషూట్స్‌) హైదరాబాద్‌ నుంచి ప్రయోగించడం జరిగిందని, ఇందులో భాగంగా పారాషూట్స్‌ గాలిలో ఎగిరిన తర్వాత 30 నుంచి 42 కి.మీ.ల ఎత్తు వరకు, 200 నుంచి 350 కి.మీ.ల వరకు రావడం జరుగుతుందని, 20 నుంచి 40 మీటర్ల పొడవుతో తాళ్లు ఉంటాయని, భూమిమీదకు దిగేముందు నెమ్మదిగా దిగుతాయని నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ తెలిపారు. ఈ పారాషూట్‌లు నిజామాబాద్‌ జిల్లాలో కూడా దిగే అవకాశముందని, కావున ప్రజలు భయాందోళనకు గురికావద్దని, వీటిపట్ల అప్రమత్తంగా ఉండి అదే సమయంలో వాటి దగ్గరకు వెళ్లకుండా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిందిగా కమీషనర్‌ సూచించారు. ప్రధానంగా పారాషూట్స్‌ ఎక్కువ గ్రామీణ ప్రాంతాల్లో దిగే అవకాశాలున్నాయని, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కమీషనర్‌ కోరారు.

Check Also

ఫిట్‌ ఇండియా లక్ష్యంగా క్రీడా పోటీలు

బీర్కూర్‌, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని సంగం తండాలో సేవా సంఘ్‌ ఫ్రెండ్స్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *