Breaking News

నూతన సంవత్సరంలో ప్రజలందరు బాగుండాలి

 

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 31

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నూతన సంవత్సరంలో ప్రజలందరు బాగుండాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రాష్ట్రప్రజలు, జిల్లా ప్రజలు కొత్త సంవత్సరంలో సుఖ సంతోషాలు కలగాలని, మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మంత్రి ఆకాంక్షించారు. తెలంగాణ వ్యవసాయ రంగానికి 2017 ఒక మైలురాయి అని, దేశంలో మొట్టమొదటిసారిగా మన రాష్ట్ర రైతులకు ముందస్తు పెట్టుబడిగా ఎకరానికి రూ. 4 వేలు ప్రకటించి 2017లోనే, 1932లో నిజాంహయాంలో జరిపిన భూ కొలతల సరిహద్దుల గుర్తింపు తిరిగి 86 ఏళ్లకు నేడు అదేస్థాయిలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ భూ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు.

రైతులకు రుణ మాఫీ విషయంలో కూడా న్యాయం చేసిందని, 2017లో నిజాంసాగర్‌ ప్రాజెక్టు నిండి లక్షలాదిమంది రైతుల జీవితాల్లో వెలుగులు నింపి రూ. 12 వందల కోట్లు పంట దిగుబడి వచ్చిందని మంత్రి అన్నారు. వ్యవసాయరంగానికి ప్రాణం నీరు అని, రాష్ట్ర వ్యవసాయ రంగానికి గుండె వంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని రకాల అనుమతులు లభించింది 2017లోనేనని,2018 నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటితో నిజాంసాగర్‌ ఆయకట్టులోని 2.10 లక్షల ఆయకట్టుకు ఏటా రెండు పంటలకు నీరు అందిస్తు ఉభయ జిల్లాల్లో బీడు భూములను సస్యశ్యామలం చేస్తామని అన్నారు. జిల్లా వరప్రదాయిని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు పునరుజ్జీవన పథకంకు శ్రీకారం చుట్టింది 2017లోనేనని ఇవేగాకుండా ఎన్నో విజయాలు అందించిన 2017కు ఘనంగా వీడ్కోలు పలుకుతూ మరెన్నో అద్భుత విజయాలు అందుకోవడానికి 2018 స్వాగతం పలకాలని రాష్ట్ర మంత్రి పోచారం అన్నారు. దార్శనికుడైన రాష్ట్ర ముక్యమంత్రి కెసిఆర్‌ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో శరవేగంగా దూసుకుపోతుందని, బంగారు తెలంగాణ ఆవిర్భవిస్తుందని మంత్రి ఆకాంక్షించారు.

Check Also

యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలని సమాచార శాఖ డిప్యుటి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *