Breaking News

ప్రజలకు పోలీసులు ఆప్తబంధువులుగా మారాలి

 

– డిజిపి మహేందర్‌రెడ్డి

కామారెడ్డి, డిసెంబర్‌ 31

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలోని అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో ప్రజలకు పోలీసు ఆప్తబంధువులుగా మారి కృసిచేయాలని డిజిపి మహేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయానికి చేరుకున్న ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలీసు సేవలపై కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. వెస్ట్‌ జోన్‌ పరిధిలో భాగంగా కామారెడ్డి జిల్లాకు రావడం జరిగిందన్నారు. శాంతిభద్రతలు తగ్గుముఖం పట్టేందుకు పోలీసుశాఖ కృషి చేస్తుందన్నారు. ఆయా పోలీసు స్టేషన్‌లలో ఫిర్యాదుదారులతో మాట్లాడి పోలీసు అధికారుల పనితీరు తెలుసుకుంటామన్నారు. 2017లో 40 శాతం నేరాలు తగ్గాయన్నారు. ఫ్రెండ్లి పోలీసింగ్‌ విధానాన్ని మరింత ముందుకు తీసుకెళతామని పేర్కొన్నారు. అంతకుముందు గంటపాటు జిల్లా పోలీసు అధికారులతో పోలిసింగ్‌ విధానాన్ని వివరించారు. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో డిగ్రీ కళాశాల మైదానానికి చేరుకున్నారు. అనంతరం అధికారులు స్వాగతం పలికారు. తిరిగి సాయంత్రం 5 గంటలకు హెలికాప్టర్‌లో హైదరాబాద్‌ వెళ్లారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ, ఐజి రవీంద్ర, ఎస్‌పి శ్వేత, జిల్లాలోని డిఎస్‌పిలు, సిఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Check Also

బోరుమోటారు ప్రారంభం

కామారెడ్డి, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 18 వ వార్డులోని అర్కల గల్లిలో బోర్‌ మోటార్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *