Breaking News

చంద్రనగర్‌లో మతమార్పిడిల అలజడి

 

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 31

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలో చంద్రనగర్‌ ప్రాంతంలో ఆదివారం ఉదయం ఒక మతానికి చెందినవారు ఇతర మతాల పిల్లలకు వారింట్లోకి పిలిచి ప్రార్థనలు చేయాలని సూచిస్తూ వారి మతాలకు సంబంధించిన పుస్తకాలు ఇవ్వడంతోపాటు ప్రతిరోజు చదవాలని పిల్లలను బలవంతం చేశారు. పిల్లలు ఈ విషయాన్ని ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులకు తెలపగా కాలనీ వాసులు వెళ్ళి సదరు వ్యక్తులను ప్రశ్నించగా సరిగా స్పందించకపోవడంతో 4వ టౌన్‌ పోలీసులను ఆశ్రయించారు. ఈ విషయంపై పోలీసులు వారిని పిలిపించి తీవ్రంగా మందలించారు. మొదటి తప్పుగా భావించి మరోసారి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టమని లిఖితపూర్వకంగా వారితో రాయించి వదిలిపెట్టడం జరిగింది. ఈ సంఘటనపై హిందూ సంస్థలు తీవ్రంగా మండిపడ్డాయి.

Check Also

రైతుకు లాభసాటి వ్యవసాయం అందించటమే ప్రభుత్వ ఉద్దేశ్యం

నిజామాబాద్‌, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏది చేసినా తెలంగాణ రాష్ట్రం, ప్రజల ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *