Breaking News

చెక్కులు పంపిణీ చేసిన రూరల్‌ ఎమ్మెల్యే

 

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 31

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ ఆదివారం రూరల్‌ నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిది చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు బాధితులకు అందడం అంటే అందని ద్రాక్షగా మిగిలేదని, కానీ ముఖ్యమంత్రి కెసిఆర్‌ తన పాలనలో సిఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను త్వరితగతిన బాధితులకు అందేలా చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. లబ్దిదారులు గంగుకు లక్ష రూపాయలు, నరేశ్‌కు 20 వేలు (జక్రాన్‌పల్లి), మనోజ్‌ రూ. 32 వేలు, ఆర్‌.పద్మారావుకు రూ. 12 వేల 500 (మనోహరాబాద్‌), కట్ట గంగారెడ్డికి రూ. 2 లక్షలు (అర్గుల్‌), గంగుకు రూ. 19 వేలు (కొలిప్యాక) తదితరులకు ఎమ్మెల్యే చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో ఎంపిపి పెద్ద రాజన్న, తెరాస మండల అధ్యక్షుడు భోజన్న, ఎంపిటిసి దీకొండ శ్రీనివాస్‌, వైస్‌ ఎంపిపి చంద్రకళ, సర్పంచ్‌లు తిరుపతిరెడ్డి, నర్సారెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు. అనంతరం ఇందల్వాయి మండల కేంద్రంలో మున్నూరు కాపు సంఘానికి రూ. 3 లక్షలు, రజక సంఘానికి రూ. 3 లక్షల నిధులు మంజూరు చేశారు.

Check Also

ఫిట్‌ ఇండియా లక్ష్యంగా క్రీడా పోటీలు

బీర్కూర్‌, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని సంగం తండాలో సేవా సంఘ్‌ ఫ్రెండ్స్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *