Breaking News

పదవీ విరమణ పొందిన రూరల్‌ ఎస్‌ఐ

 

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 31

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రూరల్‌ పోలీసు స్టేషన్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న సీతారాం రాథోడ్‌ ఆదివారం పదవీ విరమణ పొందారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్‌ ఏసిపి సుదర్శన్‌ హజరై మాట్లాడారు. పదవీ విరమణ అనేది ప్రతి ఉద్యోగికి మంచి జ్ఞాపకం లాంటిదని రాథోడ్‌ శేషజీవితం సుఖ సంతోషాలతో గడపాలని అన్నారు. కార్యక్రమంలో రూరల్‌ సిఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐలు శ్రీధర్‌గౌడ్‌, లక్ష్మయ్య, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

పారిశుద్య పనులు పర్యవేక్షించిన నగర మేయర్‌

నిజామాబాద్‌, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని జోన్‌ 1 పరిదిలోని 37వ డివిజన్‌, 16వ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *