Breaking News

షీ టీంల పనితీరు భేష్‌

 

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 31

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీసు కమీషనరేట్‌ పరిధిలో నిజామాబాద్‌, ఆర్మూర్‌, బోధన్‌ డివిజన్‌లలో షీ టీంల పనితీరు భేషుగ్గా ఉందని నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం 6 షీ టీంలు ఏర్పాటు చేసి వారికి ఇన్‌చార్జిగా ఇన్స్‌పెక్టర్‌ స్తాయి అదికారిని నియమించడం జరిగిందని, ప్రతి షీ టీంలో ఒక ఎస్‌ఐ స్థాయి అధికారి, ఇద్దరు మహిళా పోలీసు కానిస్టేబుళ్లు, ఇద్దరు కానిస్టేబుళ్ళతో ఒక బృందంగా పనిచేస్తున్నారని, వీరు ప్రధానంగా స్త్రీలపై వేధింపులు అధికంగా ఉండే ప్రాంతాలను ఎంచుకొని అక్కడ సాధారణ ప్రజలతో కలిసి వీరి వద్ద ఉండే నిఘా కెమెరాల ద్వారా ఆకతాయిల వేధింపులు రికార్డు చేసుకుంటారని, నేర స్వభావాన్ని బట్టి కౌన్సిలింగ్‌ నిర్వహించడం లేదా కేసులు నమోదు చేయడం జరుగుతుందని కమీషనర్‌ తెలిపారు. 2017 జనవరి 1వ తేదీ నుంచి డిసెంబరు 30 వరకు షీటీం ల ద్వారా పట్టుబడిన కేసుల వివరాలు వెల్లడించారు.

నిజామాబాద్‌ డివిజన్‌ పరిధిలో జరిగిన సంఘటనలు – 5, పట్టుబడిన వారు – 9, పెట్టిన కేసులు – 5, ఎఫ్‌ఐఆర్‌-0, కౌన్సిలింగ్‌ చేయబడిన వారు – 4, ఆర్మూర్‌ డివిజన్‌లో సంఘటనలు-6, పట్టుబడినవారు- 14, పెట్టిన కేసులు- 0, ఎఫ్‌ఐఆర్‌-0, కౌన్సిలింగ్‌ చేయబడినవారు- 14 మంది, బోధన్‌ డివిజన్‌లో సంఘటనలు-1, పట్టుబడినవారు-1, కౌన్సిలింగ్‌ చేయబడినవారు-1, కమీషనరేట్‌ పరిధిలో మొత్తం 12 సంఘటనలు, పట్టుబడినవారు- 24 మంది, పెట్టిన కేసులు- 5, కౌన్సిలింగ్‌ చేయబడినవారు – 19 అన్నారు. ఎవరైనా మహిళలు ఆకతాయిల వేధింపుల నుండి రక్షణ కొరకు వాట్సఫ్‌ నెంబర్‌ 9490688029 కు మెసేజ్‌ లేదా డయల్‌ 100 కు ఫోన్‌ చేయాలని కమీషనర్‌ సూచించారు.

Check Also

ఫిట్‌ ఇండియా లక్ష్యంగా క్రీడా పోటీలు

బీర్కూర్‌, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని సంగం తండాలో సేవా సంఘ్‌ ఫ్రెండ్స్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *