Breaking News

Daily Archives: January 2, 2018

బిసి, ఈబిసి విద్యార్థులు దరఖాస్తు ఫారాలు సమర్పించాలి

  కామారెడ్డి, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రయివేటు జూనియర్‌, డిగ్రీ, పిజి, బిఇడి కళాశాలల యాజమాన్యాలు బిసి, ఈబిసి విద్యార్థుల దరఖాస్తు ఫారాలను సమర్పించాలని జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ది అధికారి దేవిదాస్‌ ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాలల ప్రధానాచార్యులు వారి కళాశాలలకు సంబంధించి ఇంకా సమర్పించని దరఖాస్తులన్నింటిని తమ కార్యాలయంలో ఈనెల 7వ తేదీలోగా సమర్పించాలని పేర్కొన్నారు. 2016-17 సంవత్సరానికి సంబంధించి బిసి, ఈబిసి విద్యార్థులకు నేటి వరకు మంజూరు …

Read More »

గ్రామ సమస్యల పరిష్కారం కోసమే గ్రామ సభలు

  బీర్కూర్‌, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌, నసురుల్లాబాద్‌ మండలాల్లోని ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం గ్రామసభలు నిర్వహిస్తున్నామని మండల అభివృద్ది అధికారి భరత్‌ కుమార్‌ అన్నారు. ఈనెల 3 నుంచి 9వ తేదీ వరకు గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. మండలంలోని ఆయా గ్రామాల్లో గల వివిధ శాఖల అధికారులు తమ పూర్తి సమాచారంతో హాజరు కావాలని సూచించారు.

Read More »

విద్యార్థులకు స్కూలు బ్యాగుల పంపిణీ

  బీర్కూర్‌, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జడ్పిహెచ్‌ఎస్‌ నెమ్లి పాఠశాలలో 200 మంది విద్యార్థులకు స్కూల్‌ బ్యాగులను పట్లోల్ల మోహన్‌రెడ్డి కుమార్తె సుచరిత విరాళంగా అందజేశారు. మంగళవారం మోహన్‌రెడ్డి చేతుల మీదుగా విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జడ్పిహెచ్‌ఎస్‌ నెమ్లి పాఠశాలను దత్తత తీసుకొని నెమ్లి సాయిబాబ ఆలయం స్థాయిలో అభివృద్ది చేస్తామని హామీ ఇచ్చారు. పదవ తరగతి ఇంగ్లీష్‌ మీడియంలో ఎస్‌ఏ 1లో ప్రథమ స్థానంలో నిలిచిన గాండ్ల ప్రమీలకు రూ. …

Read More »

కలెక్టర్‌కు అధికారుల న్యూఇయర్‌ శుభాకాంక్షలు

  కామారెడ్డి, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణతోపాటు సంయుక్త కలెక్టర్‌ సత్తయ్యలను వివిధ శాఖల అధికారులు మంగళవారం వారి కార్యాలయాల్లో కలుసుకొని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా పౌర సంబంధాల అధికారి పద్మ, సహాయ పౌరసంబంధాల అధికారి వెంకటేశ్వర్‌రావులు కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌లకు పుస్తకాలు, పెన్నులు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

Read More »

ప్రజా సమస్యలపై టిమాస్‌ ఆధ్వర్యంలో పోరాటం

  కామారెడ్డి, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, ప్రజా సమస్యలపై టిమాస్‌ ఫోరం పోరాటాలు చేయడానికి సిద్దమని టిమాస్‌ రాష్ట్ర స్టీరింగ్‌ కమిటీ సభ్యులు నాగేశ్వర్‌రావు అన్నారు. మంగళవారం బీబీపేట మండల కేంద్రంలో టిమాస్‌ ఫోరం మండల సమావేశం నిర్వహించారు. దీనికి టిమాస్‌ జిల్లా స్టీరింగ్‌ కమిటీ సభ్యురాలు సబిత అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ రాష్ట్రంలో పాలన నలుగురి చేతుల్లోనే సాగుతుందని, ఇచ్చిన హామీలను అమలు చేయాలని …

Read More »

సైన్స్‌ కాంగ్రెస్‌లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కలెక్టర్‌ ప్రశంస

  కామారెడ్డి, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అహ్మదాబాద్‌లో జరిగిన జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌లో ప్రతిభ కనబరిచిన విద్యార్థి బృందాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ, జాయింట్‌ కలెక్టర్‌ సత్తయ్య, డిఇవో మదన్‌మోహన్‌లు అభినందించారు. కలెక్టరేట్‌ కార్యాలయంలో వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల అంబరిపేటకు చెందిన 9వ తరగతి విద్యార్థులు మహేందర్‌ రెడ్డి బృందం రూపొందించిన మోడిఫైడ్‌ బ్యాలెన్సుడు షీప్‌ ఫీడ్‌ అనే ప్రాజెక్టుకు జాతీయ స్థాయిలో …

Read More »

సురేశ్‌ కుటుంబాన్ని పరామర్శించిన బిజెపి నాయకులు

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిజెపి మాజీ కౌన్సిలర్‌ సురేశ్‌ కుటుంబాన్ని భారతీయ జనతాపార్టీ నాయకులు మంగళవారం పరామర్శించారు. గత వారం సురేశ్‌ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సురేశ్‌ సతీమణి లీలను బీడీ కార్మిక సంక్షేమ నిధి వైస్‌ఛైర్మన్‌ లోకభూపతిరెడ్డి, బిజెపి కేంద్ర కార్యవర్గ సభ్యులు టక్కర్‌ హన్మంత్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి శివరాజ్‌ తదితరులు పరామర్శించారు.

Read More »

జిల్లాలో 2 వేల కోట్లతో మిషన్‌ భగీరథ

  కామారెడ్డి, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా మొత్తానికి మిషన్‌ భగీరథ పథకం ద్వారా నీరందించేందుకు రూ. 2 వేల కోట్లు ఖర్చుపెడుతున్నట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశాయ్‌పేట గ్రామంలో మంగళవారం ఇంటింటికి తాగునీటి సరఫరాను మంత్రి ప్రారంభించారు. గ్రామంలో మొత్తం 704 ఇళ్ళలో కుళాయిలు బిగించినట్టు తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా దేశాయ్‌పేట గ్రామ ఆడబిడ్డలకు బహుమతి అందించినట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ …

Read More »

వివాహిత అదృశ్యం

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వర్ని మండలం జలాల్‌పూర్‌ గ్రామానికి చెందిన ఏ.సునీత (28) గత డిసెంబరు 30 తేదీ నుంచి కనబడకుండా పోయిందని, మూడురోజులు గడుస్తున్నా ఇంటికి తిరిగి రాకపోవడంతో భర్త సాయిలు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని వర్ని ఎస్‌ఐ చంద్రశేఖర్‌ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

Read More »

గుర్తు తెలియని వ్యక్తి మృతి

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలో గౌతంనగర్‌ బైపాస్‌ రోడ్డులో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్టు 3వ టౌన్‌ ఎస్‌ఐ -2 వెంకట్‌ తెలిపారు. మంగళవారం ఉదయం ఒక వ్యక్తి అచేతనంగా పడిఉండడాన్ని గమనించిన స్తానికులు పోలీసులకు సమాచారం అందించగా, ఎస్‌ఐ వెంకట్‌ సంఘటన స్థలానికి చేరుకొని మృత దేహాన్ని జిల్లా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు.

Read More »