Breaking News

Daily Archives: January 4, 2018

దీక్షాస్వామిపై చేయిచేసుకున్న హెడ్‌కానిస్టేబుల్‌

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ పోలీసు స్టేషన్‌లో పిర్యాదు చేయడానికి వెళ్లిన దీక్షాస్వామి బాలకృష్ణపై హెడ్‌కానిస్టేబుల్‌ అజ్మత్‌ చేయిచేసుకున్న సంఘటన గురువారం జరిగింది. దీంతో పెద్ద సంఖ్యలో అయ్యప్పదీక్షా స్వాములు పోలీసు స్టేషన్‌కు చేరుకొని అజ్మత్‌ను వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తు స్టేషన్‌ ముందు బైఠాయించారు. ఘటనా స్థలానికి చేరుకున్న బాన్సువాడ డిఎస్‌పి నర్సింగ్‌రావు స్వాములను సముదాయించి అజ్మత్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పడంతో శాంతించారు.

Read More »

ఇసుక మాఫియా చేతిలో విఆర్‌ఏ దారుణ హత్య

  కామారెడ్డి, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా జుక్కల్‌ నియోజకవర్గం పిట్లం మండలం కాందాపూర్‌ కాకివాగు నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను అడ్డుకున్నాడని ఓ విఆర్‌ఏను దారుణంగా హత్య చేసిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లాలోని పిట్లం ప్రాంతంలో ఇసుక మాఫియా ఆగడాలు చాలా ఏళ్ళుగా సాగుతున్నాయి. విషయం తెలుసుకొని కాకివాగుకు వెళ్లిన విఆర్‌ఏ సాయిలు ఇసుక తరలింపును అడ్డుకునే ప్రయత్నం చేయగా రెచ్చిపోయిన ఇసుక మాఫియా అడ్డొచ్చిన విఆర్‌ఏ సాయిలును అమానుషంగా …

Read More »

ఎక్సైజ్‌ సిబ్బందికి రాష్ట్రస్థాయి పురస్కారాలు

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ ఎక్సైజ్‌ సిబ్బంది రాష్ట్ర స్థాయి పురస్కారాలు అందుకున్నారు. ఎక్సైజ్‌ ఎన్‌పోర్సు మెంట్‌ డైరెక్టర్‌ అకుల్‌ సబర్వాల్‌ చేతుల మీదుగా నిజామాబాద్‌ ఎక్సైజ్‌ సిబ్బంది పురస్కారాలు అందుకున్నారు. వీరిలో మహ్మద్‌ సాదిక్‌ అలీ- ఏసి ఎన్‌ఫోర్సు మెంట్‌ నిజామాబాద్‌, జే. మధుబాబు-ఏసి ఎన్‌ ఫోర్సుమెంట్‌ నిజామాబాద్‌, పటేల్‌ బానోత్‌ – ఎస్‌హెచ్‌వో మోర్తాడ్‌, నాగరాజు – ఎస్‌హెచ్‌వో కామారెడ్డి, కె.ధర్మేందర్‌-ఏసి ఎన్‌ఫోర్సుమెంట్‌ నిజామాబాద్‌, ఆర్‌.కవిత- టాస్క్‌పోర్సు నిజామాబాద్‌, కె.అవినాశ్‌-ఎస్‌హెచ్‌వో ఎల్లారెడ్డి. …

Read More »

కారేగాం ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన బహుజన సంఘాలు

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహారాష్ట్రలోని పూణె సమీపంలో జనవరి 1న దేశవ్యాప్తంగా ఉన్న దళితులు బీమా కారేగాం చేరుకున్న సందర్భంగా జరిగిన ఆందోళనలో కొంతమంది కుట్రపూరితంగా వ్యవహరించి దళితులపై రాళ్లతో దాడిచేశారని, ఈ దాడుల్లో రాహుల్‌ అనే యువకుడు చనిపోవడం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తు దళిత సంఘాలు నిజామాబాద్‌ నగరంలోని నలుమూలల నుంచి భారీ ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ రవిందర్‌రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. …

Read More »

లోపాన్ని వరంగా మార్చుకోవాలి

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భగవంతుడు అందరిని ఒకేవిధంగా పుట్టించడని, ఏదో ఒక లోపంతో కొందరు పుడుతుంటారని దాన్ని శాపంగా కాకుండా వరంగా మార్చుకోవాలని నిజామాబాద్‌ నగర మేయర్‌ ఆకుల సుజాత అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని న్యూఅంబేడ్కర్‌ భవనంలో లూయిస్‌ బ్రెయిలీ జన్మదినం సందర్భంగా జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ రవిందర్‌రెడ్డితోపాటు ఆమె పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆర్‌వో నవనీత, ఐసిడిఎస్‌ పిడి స్రవంతి, స్నేహ సొసైటీ కన్వీనర్‌ సిద్దయ్య, అంధ విద్యార్థులు, సిడిపివో, తదితరులు పాల్గొన్నారు.

Read More »

రోడ్డు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్త గురువారం నగరంలో చేపడుతున్న రోడ్డు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నగరంలో మిషన్‌ భగీరథ పనుల వల్ల రోడ్లు ధ్వంసమయ్యాయని, త్వరలో అన్ని పనులు పూర్తిచేసి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు ఈ అంశంపై అధికారులకు పలు సూచనలు చేశారు.

Read More »

క్రికెట్‌ టోర్ని విజేతలకు బహుమతుల ప్రదానం

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలో గత వారంరోజులుగా జరుగుతున్న క్రికెట్‌ టోర్ని విజేతలకు గురువారం నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్త బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహిస్తుందని, ఔత్సాహిక క్రీడాకారులు ఏక్రీడకు సంబంధించిన వారైనా డిఎస్‌ఏ అదికారులనుగాని, తనను కాని ఎల్లవేళలా సంప్రదించవచ్చని ఎమ్మెల్యే తెలిపారు.

Read More »

సకల కళల నిలయం ఖిల్లా రఘునాథ ఆలయం

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రఘునాథ ఆలయం సకల కళలకు నిలయమని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారి గురునాథం అన్నారు. గురువారం స్థానిక ఖిల్లా రఘునాథ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకునేందుకు ఆలయాలు ఎంతో దోహదపడతాయని, దేవాలయాలు పురాతన చరిత్రకు సాక్ష్యాలని, ఖిల్లా రామాలయ నిర్మాణం అద్భుతంగా ఉందని కొనియాడారు. ఏకశిల రామ విగ్రహం తాబేలుపై ఉండడం విశేషమని ఆయన అన్నారు. అర్చకులు …

Read More »

ఎమ్మెల్యే బిగాలను కలిసిన నిజామాబాద్‌ డివిజన్‌ పోలీసులు

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని నిజామాబాద్‌ ఏసిపి సుదర్శన్‌ ఆద్వర్యంలో ఎమ్మెల్యే గణేశ్‌ గుప్తను గురువారం డివిజన్‌ సిఐలు, ఎస్‌ఐలు కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నిజామాబాద్‌ నగర సిఐ సుభాష్‌చంద్రబోస్‌, ఎస్‌ఐలు ఆంజనేయులు, శ్రీహరి, కృష్ణ, శ్రీధర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

మంచి ఆలోచన ద్వారా తమను తాము తీర్చిదిద్దుకోవాలి

  కామారెడ్డి, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అందులు సహజంగా దివ్యాంగులని వారు అమోఘమైన శక్తి కలిగిఉంటారని మంచి ఆలోచన ద్వారా తమను తాము తీర్చిదిద్దుకోవాలని అన్నారు. అంధుల ఆరాధ్యదైవం లూయిస్‌ బ్రెయిలీ 209వ జన్మదినం సందర్భంగా గురువారం దివ్యాంగులు, మహిళా వికలాంగులు వృద్దుల శాఖ ఆద్వర్యంలో గురువారం జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. పలువురు అంధులకు సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంధులు సహజంగా దివ్యాంగులని, వారు తాము కోరుకున్న రంగాల్లో విజయం సాధించగల శక్తి …

Read More »