Breaking News

ఇసుక మాఫియా చేతిలో విఆర్‌ఏ దారుణ హత్య

 

కామారెడ్డి, జనవరి 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా జుక్కల్‌ నియోజకవర్గం పిట్లం మండలం కాందాపూర్‌ కాకివాగు నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను అడ్డుకున్నాడని ఓ విఆర్‌ఏను దారుణంగా హత్య చేసిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లాలోని పిట్లం ప్రాంతంలో ఇసుక మాఫియా ఆగడాలు చాలా ఏళ్ళుగా సాగుతున్నాయి.

విషయం తెలుసుకొని కాకివాగుకు వెళ్లిన విఆర్‌ఏ సాయిలు ఇసుక తరలింపును అడ్డుకునే ప్రయత్నం చేయగా రెచ్చిపోయిన ఇసుక మాఫియా అడ్డొచ్చిన విఆర్‌ఏ సాయిలును అమానుషంగా ట్రాక్టర్‌తో తొక్కి చంపారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, మృతుని కుటుంబీకులు సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళనకు దిగారు. నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. కేసులో దుర్గయ్య, రాజు అనే ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసినట్టు సమాచారం. ఈ ఘటనపై వెంటనే విచారణ చేపట్టి నిందితులను శిక్షించాలని జిల్లా ఎస్‌పి శ్వేతారెడ్డికి ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు అందాయి. ఈ క్రమంలో ఇసుక మాఫియాను అణిచివేసేందుకు పోలీసు అదికారులు చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.

Check Also

బాసరకు పాదయాత్ర

  బీర్కూర్‌, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వసంత పంచమి సరస్వతిదేవి జన్మదినాన్ని పురస్కరించుకొని బీర్కూర్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *