Breaking News

ఎక్సైజ్‌ సిబ్బందికి రాష్ట్రస్థాయి పురస్కారాలు

 

నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ ఎక్సైజ్‌ సిబ్బంది రాష్ట్ర స్థాయి పురస్కారాలు అందుకున్నారు. ఎక్సైజ్‌ ఎన్‌పోర్సు మెంట్‌ డైరెక్టర్‌ అకుల్‌ సబర్వాల్‌ చేతుల మీదుగా నిజామాబాద్‌ ఎక్సైజ్‌ సిబ్బంది పురస్కారాలు అందుకున్నారు.

వీరిలో మహ్మద్‌ సాదిక్‌ అలీ- ఏసి ఎన్‌ఫోర్సు మెంట్‌ నిజామాబాద్‌, జే. మధుబాబు-ఏసి ఎన్‌ ఫోర్సుమెంట్‌ నిజామాబాద్‌, పటేల్‌ బానోత్‌ – ఎస్‌హెచ్‌వో మోర్తాడ్‌, నాగరాజు – ఎస్‌హెచ్‌వో కామారెడ్డి, కె.ధర్మేందర్‌-ఏసి ఎన్‌ఫోర్సుమెంట్‌ నిజామాబాద్‌, ఆర్‌.కవిత- టాస్క్‌పోర్సు నిజామాబాద్‌, కె.అవినాశ్‌-ఎస్‌హెచ్‌వో ఎల్లారెడ్డి. ఈ సందర్భంగా అకుల సబర్వాల్‌ మాట్లాడుతూ డిప్యూటి కమీషనర్‌ స్థాయి నుంచి కానిస్టేబుల్‌ వరకు సిబ్బంది చిత్తశుద్దితో పనిచేసి వందశాతం గుడుంబా నియంత్రణ చేశారని, ఇందుకు సిబ్బందిని అభినందించారు. ఇదే ఉత్సాహంతో పనిచేసి ఇతర ఎక్సైజ్‌ నేరాల నియంత్రణకు పాటుపడాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో నిజామాబాద్‌ డిప్యూటి కమీషనర్‌ డేవిడ్‌ రవికాంత్‌, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ శ్రీనివాసులు పాల్గొన్నారు.

Check Also

బాసరకు పాదయాత్ర

  బీర్కూర్‌, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వసంత పంచమి సరస్వతిదేవి జన్మదినాన్ని పురస్కరించుకొని బీర్కూర్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *