Breaking News

Daily Archives: January 5, 2018

విఆర్‌ఏ హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా పిట్లం మండలం కారేగాం శివారులోని కాకివాగు వద్దనుంచి ఇసుక తరలింపును అడ్డుకున్నందుకు విఆర్‌ఏ సాయిలును ట్రాక్టర్‌తో హత్యచేసిన ఇసుక మాఫియాను కఠినంగా శిక్షించాలని సిపిఎం జిల్లా కమిటీ డిమాండ్‌ చేసింది. అధికార పార్టీ అండదండలతో ఇసుక మాఫియా రెచ్చిపోతుందని, కేసును అధికార పార్టీ నాయకులు పక్కతోవ పట్టించడానికి ప్రయ్నతిస్తున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేశ్‌బాబు ఆరోపించారు. సాయిలు మృతికి కారకులైనవారిని కఠినంగా శిక్షించి, 5 లక్షల ఎక్స్‌గ్రేషియా …

Read More »

6న ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి రాక

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలోని ఆలూరు గ్రామంలో నిర్వహిస్తున్న రైతు సదస్సుకు టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శనివారం హాజరుకానున్నారు. ఇందుకోసం కాంగ్రెస్‌ నాయకులు రైతుల సమీకరణలో నిమగ్నమయ్యారు.

Read More »

ఎంపి కవితకు కృతజ్ఞతలు తెలిపిన సాయికుమార్‌

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలో కుర్రు కులస్తుల కొరకు భవన నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తున్నామని పేర్కొన్న నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవితకు తెరాస నాయకులు, రాష్ట్ర కుర్రు కుల సంఘం అధ్యక్షుడు సాయికుమార్‌ కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం మానిక్‌ భండార్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత నెలలో కుర్రు రణభేరి సందర్భంగా ఎంపి కవితను కుర్రు భవనం గురించి నిదులు మంజూరు చేయాలని కోరగా ఎంపి నిధులతో సరిపెట్టకుండా మొత్తం …

Read More »

6న మన ఊరు – మన ఎంపి కార్యక్రమం

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాక్లూర్‌ మండలం మాణిక్‌ బండార్‌ గ్రామంలో 6వ తేదీన మన ఊరు మన ఎంపి కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్‌ ఎంపి కవిత హాజరవుతున్నట్టు ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని, గ్రామస్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Read More »

మహా గణపతి ఆలయంలో సంకటచతుర్థి

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలోని బొడ్డెమ్మ చెరువు సమీపంలోగల మహా గణపతి ఆలయంలో సంకట చతుర్థి పురస్కరించుకొని స్వామివారికి పంచామృతం, పాలాభిషేకం నిర్వహించినట్టు ఆలయ ఛైర్మన్‌ భూషణ్‌ చారి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుక్రవారం సింధూర సమర్పణ, గరికపూజ, ప్రత్యేక పూజలు నిర్వహించినట్టు తెలిపారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించినట్టు చెప్పారు.

Read More »

వెల్‌నెస్‌ సెంటర్‌ను త్వరలో ఏర్పాటు చేస్తాం

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జర్నలిస్టులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వెల్‌నెస్‌ సెంటర్‌ను తక్షణమే ఏర్పాటు చేయాలని జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు శుక్రవారం నిజామాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో ఎంప్లాయిస్‌ హెల్త్‌ స్కీం సిఇవో కల్వకుంట్ల పద్మను కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరంలో తక్షణమే వెల్‌నెస్‌ సెంటరు ఏర్పాటు చేయాలని, జర్నలిస్టులకు అందుబాటులో ఉండే ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని, అన్ని వసతులతో కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, కార్పొరేట్‌ వైద్య సేవలు, జర్నలిస్టు …

Read More »

సావిత్రిబాయిని ఆదర్శంగా తీసుకోవాలి

  కామారెడ్డి, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సావిత్రిబాయి ఫూలేను ఆదర్శంగా తీసుకొని ఆమె బాటలో నడవాలని ప్రభుత్వ విప్‌ గంప గోవర్దన్‌ పిలుపునిచ్చారు. వరలక్ష్మి గార్డెన్‌లో శుక్రవారం నిర్వహించిన ఎస్‌సి, ఎస్‌టి ఉపాధ్యాయ సంఘం ఆద్వర్యంలో జయంతి ఉత్సవాలకు ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. విద్యార్థులు, యువత సావిత్రిబాయి ఫూలే చరిత్ర తెలుసుకొని సామాజిక సేవతోపాటు జీవితంలో నలుగురికి ఉపయోగపడేలా పనిచేయాలన్నారు. అంతకుముందు ఆమె చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మునిసిపల్‌ ఛైర్మన్‌ పిప్పిరి సుష్మ, జడ్పిటిసి నంద …

Read More »

దళిత సంఘాలకు 60 లక్షల నిధులు మంజూరు

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్త శుక్రవారం నగరంలోని 12 దళిత సంఘాలకు సిడిపి నిదుల ద్వారా ఒక్కో సంఘానికి రూ. 5 లక్షల చొప్పున 60 లక్షల నిదులు మంజూరు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని కులాలకు నిధులు మంజూరు చేసి వారి సామాజిక అభివృద్దికి తోడ్పడుతుందని, కమ్యూనిటి హాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల ప్రజల మధ్య సత్సంబంధాలు పెరుగుతాయని ఈసందర్భంగా …

Read More »

కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్త నగరంలో శుక్రవారం 22వ, 23వ, 20వ, 19వ, 18వ, 16వ డివిజన్‌లలో ఇంటింటికి వెళ్ళి మొత్తం 24 కళ్యాణలక్ష్మి చెక్కులను, నూతన వధూవరులకు తన కానుకగా చీర, నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మి పథకం ద్వారా పేద ఆడబిడ్డ పెళ్లిని ఎలాంటి ఆర్తిక ఇబ్బందులు లేకుండా నిర్వహిస్తున్నారన్నారు. ఇలాంటి కార్యక్రమం …

Read More »

సాయిబాబా ఆలయానికి రెండు లక్షల విరాళం

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలో హమాల్‌వాడిలోని సంతోషిమాత, సాయిబాబా ఆలయానికి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్త శుక్రవారం రెండు లక్షల విరాళం అందజేశారు. ఈ సందర్భంగా గుప్త మాట్లాడుతూ నగరంలో మరిన్ని ఆలయాలు గుర్తించి తనవంతు సహాయంగా అభివృద్దికి సహకరిస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్‌ నర్సింహా, కూన దయానంద్‌ గుప్త, పటేవార్‌ శ్రీనివాస్‌, హరిబాబు గుప్త, గజవాడ ఆగమయ్య గుప్త, శ్రీనివాస్‌ గుప్త, వెంకటేశం గుప్త, విశ్వనాథం …

Read More »