Breaking News

Daily Archives: January 6, 2018

కొత్త కలెక్టర్‌గా రామ్మోహన్‌రావు

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ కొత్త కలెక్టర్‌గా రామ్మోహన్‌రావు శనివారం బాధ్యతలు స్వీకరించారు. నిజామాబాద్‌ ఇన్‌చార్జి కలెక్టర్‌ రవిందర్‌రెడ్డి నుంచి చార్జి తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాపై అవగాహన పెంచుకొని మంచి పాలన అందిస్తానని, అధికారుల సూచనలు, సలహాలతో జిల్లా అభివృద్దిలో తనవంతు పాత్ర నిర్వహిస్తానని పేర్కొన్నారు.

Read More »

పాలనలో ప్రభుత్వ అధికారులదే కీలకపాత్ర

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ పాలనలో అధికారులదే కీలకపాత్ర అని నిజామాబాద్‌ ఎంపి కవిత అన్నారు. శనివారం రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో టిఎన్‌జివోస్‌ డైరీ, క్యాలెండర్‌ ఆవిష్కరణ కార్యక్రమానికి ఎంపి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. టిఎన్‌జివోస్‌ నాయకులు, ఉద్యోగులు తెలంగాణ ఉద్యమంలో సిఎం కెసిఆర్‌కు బాసటగా నిలిచి నైతిక స్థైర్యాన్ని అందించారని అన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేసే బాద్యత అధికారులు సక్రమంగా నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. టిఎన్‌జివోస్‌ నాయకులు అన్ని శాఖల అధికారులను కలుపుకొని …

Read More »

గ్రామాల అభివృద్దికి సహకరించండి

  నిజాంసాగర్‌, జనవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల అభివృద్దికి ప్రతి ఒక్కరు సహకరించాలని సర్పంచ్‌ బత్తుల రమ అన్నారు. నిజాంసాగర్‌ మండలంలో శనివారం హసన్‌పల్లి గ్రామంలో సర్పంచ్‌ అధ్యక్షతన నిర్వహించిన గ్రామ సభలో ఆమె మాట్లాడారు. ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం చేపడతామన్నారు. అలాగే గ్రామంలో మరుగుదొడ్లు, సిసి రోడ్ల నిర్మాణం చేపట్టేవిధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. గ్రామంలో వీధి దీపాలు ఏర్పాటు చేసే విధంగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. సమావేశంలో ఉపసర్పంచ్‌ వెంకట్‌రాములు, తెరాస నాయకులు …

Read More »

బాధిత కుటుంబానికి పరామర్శ

  నిజాంసాగర్‌, జనవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని మహ్మద్‌ నగర్‌ గ్రామానికి చెందిన రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు దుబ్బ శ్రీహరి కుటుంబాన్ని జడ్పి ఛైర్మన్‌ దఫేదార్‌ రాజు పరామర్శించారు. ఈనెల 1వ తేదీన అనారోగ్యంతో శ్రీహరి మృతి చెందాడు. ఈ సందర్భంగా శ్రీహరి చిత్రపటానికి నివాళులు అర్పించి కుటుంబీకులను ఓదార్చారు.

Read More »

ఇసుక ట్రాక్టర్‌ ఢీకొనడంతోనే సాయిలు మృతి

  కామారెడ్డి, జనవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇసుక ట్రాక్టర్‌ తలపైనుంచి వెళ్ళడంతోనే పిట్లంకు చెందిన సాయిలు మృతి చెందాడని జిల్లా పోలీసు కార్యాలయం నుంచి శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. తదుపరి విచారనలో భాగంగా సేకరించిన సాంకేతిక సాక్ష్యాధారాల ప్రకారం ఇసుక అక్రమ రవాణా గురించి మృతుడు సాయిలుకు ఎటువంటి సమాచారం అందలేదన్నారు. శుక్రవారం విచారణ జరిపి సాక్ష్యాధారాలు, సాంకేతిక సాక్ష్యాధారాలతో నిర్దారించినట్టు తెలిపారు. శవ పరీక్ష జరిపిన వైద్యాధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం మృతుడు …

Read More »

ప్రమాదాల నివారణకై అవగాహన

  నిజాంసాగర్‌, జనవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని గాలిపూర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్రమాదాల నివారణపై అగ్నిమాపక శాకాధికారులు అవగాహన కల్పించారు. ప్రమాదవశాత్తు సంభవించే అగ్నిప్రమాదాల సమయంలో ఆపదలో ఉన్న వారిని రక్షించడానికి చేపట్టాల్సిన చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు నర్సింగ్‌రావు, బాన్సువాడ అగ్నిమాపక సిబ్బంది ఉన్నారు.

Read More »

కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్త శనివారం 39వ డివిజన్‌లోని అర్సపల్లిలో కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. తనవంతు సాయంగా నూతన వధూవరులకు వస్త్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కళ్యాణలక్ష్మి పథకం బృహత్తరమైనదని, ఈ పథకం ద్వారా ఎంతో మంది పేదలు వారి ఆడపిల్లల పెళ్ళిళ్ళను నిర్భయంగా నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో తెరాస నాయకులు ముచ్కూరు మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

ప్రజావాణి ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో నమోదుచేసి పరిస్కరించాలి

  కామారెడ్డి, జనవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణిలో వస్తున్న ఫిర్యాదులను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేసి వాటిని పరిష్కరించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అధికారులకు సూచించారు. బిచ్కుంద మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన ప్రజావాణిలో ఆయన పాల్గొన్నారు. వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఆయన స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ ప్రజల సమస్యలను వెంటనే పరిస్కరిస్తే వారికి సత్వర న్యాయం జరుగుతుందన్నారు. ఓడిఎఫ్‌కు సంబందించి జిల్లాలో 39 శాతం నుంచి 83 శాతానికి …

Read More »

కలెక్టరేట్‌ ఎదుట ఏఐటియుసి ఆధ్వర్యంలో ధర్నా

  కామారెడ్డి, జనవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ఐక్య బిల్డింగ్‌ అండ్‌ అదర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ వర్కర్స్‌ యూనియన్‌ – ఏఐటియుసి ఆధ్వర్యంలో శనివారం కామారెడ్డి కలెక్టరేట్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సంయుక్త కలెక్టర్‌ సత్తయ్యకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు తిరుపతి, కార్యదర్శి రాజలింగం మాట్లాడుతూ జిల్లాలో భవన నిర్మాణ కార్మికులకు గత 2016 మార్చి నుంచి కార్డుల జారీ ప్రక్రియ ఆగిపోయిందన్నారు. పదిసంవత్సరాల రెనివల్‌ తీసుకోవడం లేదని జిల్లా కార్యాలయంలో …

Read More »

స్వచ్చంద ఆరోగ్య నేస్తం కేంద్రం ప్రారంభం

  కామారెడ్డి, జనవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా మద్నూర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం స్వచ్చంద ఆరోగ్య నేస్తం కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ ప్రారంభించారు. రిటైర్డ్‌ ఉద్యోగులు, స్వచ్చంద సేవా సభ్యులతో కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రిటైర్డ్‌ ఉద్యోగులు స్వచ్చంద ఆరోగ్య నేస్తం సభ్యులుగా రోగులకు, వైద్యులకు మధ్య సమన్వయ కర్తలుగా సలహాలు, సూచనలు అందించడం మంచి పరిణామమని, అభినందనీయమని అన్నారు. రోగుల్లో ఉన్న భయాలను, అనుమానాలను తొలగించాలని సూచించారు. …

Read More »