Breaking News

Daily Archives: January 7, 2018

ఇసుక మాఫియాను అరికట్టాలి

  కామారెడ్డి, జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో ఇసుక మాఫియాను అరికట్టాలని శాసనమండలి ప్రతిపక్షనేత షబ్బీర్‌ అలీ డిమాండ్‌ చేశారు. ఆదివారం స్తానిక విలేకరులతో మాట్లాడారు. తెరాస ప్రభుత్వంలో కెసిఆర్‌ కుటుంబీకులు ఉన్న జిల్లాల్లో ఇసుక మాఫియా రెచ్చిపోతుందని ఆరోపించారు. నేరెళ్ల ఘటనలో ఇప్పటి వరకు దోషులను శిక్షించలేదని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక మాఫియా సంఘటనల్లో 11 మంది అమాయకులు చనిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఇసుక మాఫియాను నిరోధించాలని కోరారు. సమావేశంలో …

Read More »

ముదిరాజ్‌ కులస్తులకు ఆర్థికంగా ఆదుకునేంత వరకు వరకు పోరాటం చేస్తాం

  నిజాంసాగర్‌, జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల్లోని ముదిరాజ్‌ కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకునేంత వరకు పోరాటం చేస్తామని ముదిరాజ్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు విఠల్‌ అన్నారు. ఆదివారం మండల అధ్యక్షునిగా సాదుల సత్యనారాయణ నియామకం కావడంతో జిల్లా అధ్యక్షుడు నియామక పత్రం అందజేశారు. అనంతరం విఠల్‌ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ పరంగా ప్రయోజనం జరిగిందని, ముదిరాజ్‌ కులస్తులకు ఇప్పటివరకు ఎలాంటి ఆర్థిక ప్రయోజనం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముదిరాజ్‌ కులస్తులను ఐక్యం …

Read More »

చెరువులో పడి యువకుడు మృతి

  నిజాంసాగర్‌, జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని మల్లూరు గ్రామానికి చెందిన గైని నరేశ్‌ (22) అనేయువకుడు ఆదివారం గ్రామ శివారులోని ఊర చెరువు వద్ద కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళి నీటిలో దిగగా ప్రమాదవశాత్తు కాలుజారి మునిగి మృతి చెందినట్టు పిట్లం ఎస్‌ఐ అంతిరెడ్డి, నిజాంసాగర్‌ ఏఎస్‌ఐ గాంధీగౌడ్‌ తెలిపారు. వీరి కథనం ప్రకారం…. గ్రామానికి చెందిన నరేశ్‌ కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళి నీటిలో ప్రమాదవశాత్తు కాలుజారి పడడంతో ఈత రాక మునిగి మృతి చెందినట్టు పేర్కొన్నారు. మృతుని …

Read More »

హైదరాబాద్‌ బయల్దేరిన రజక సంఘం నేతలు

  కామారెడ్డి, జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రజకుల సమస్యల సాధనకై ఆదివారం హైదరాబాద్‌లో తలపెట్టిన సభకు కామారెడ్డి జిల్లాలోని ఆయా మండలాల నుంచి వేలాది మంది రజకులు ప్రత్యేక వాహనాల్లో బయల్దేరారు. అంతకుముందు రజక సంఘం ప్రతినిధులు మిడుదొడ్డి స్వామి, ఎన్‌.స్వామి, రాజు, రాజయ్య, నర్సయ్యలు విలేకరులతో మాట్లాడారు. గత కొన్ని రోజులుగా కామారెడ్డి జిల్లాలో పాదయాత్ర చేపట్టి రజకులను ఒకతాటిపైకి తీసుకొచ్చామని తెలిపారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సరూర్‌నగర్‌లో భారీ బహిరంగ సబ నిర్వహించి తమ …

Read More »

లయన్స్‌ సేవలు విస్తృత పరచాలి

  కామారెడ్డి, జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ క్లబ్‌ సేవలను మరింత విస్తృత పరిచి ముందుండాలని క్లబ్‌ జిల్లా మాజీ గవర్నర్‌ రాజ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక క్లబ్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. కామారెడ్డి లయన్స్‌ క్లబ్‌ ఉత్తమ సేవలుఅందించినందుకు గాను బెస్టు అవార్డును ప్రకటించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు రమేశ్‌ను సన్మానించారు. కార్యక్రమంలో క్లబ్‌ ప్రతినిధులు నిమ్మ దామోదర్‌రెడ్డి, గంగాధర్‌, శ్యాంగోపాల్‌, తదితరులున్నారు.

Read More »

దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి

  కామారెడ్డి, జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జనవరి 17న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి సిద్దిరాములు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రమలు కోరారు. ఆదివారం కామరెడ్డి జిల్లా కేంద్రంలో సన్నాహక సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా వివిధ స్కీముల్లో పనిచేస్తున్న అంగన్‌వాడి, మధ్యాహ్న భోజన, ఆశా, ఎన్‌హెచ్‌ఎం, ఐకెపి, విఓఎ తదితరుల డిమాండ్లు పరిష్కరించాలని ఒకరోజు సమ్మె నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కార్మికులకు కనీస వేతనంగా రూ. 18 వేలు …

Read More »

రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీదే భవిష్యత్తు

  కామారెడ్డి, జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాబోయే రోజుల్లో ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకే పట్టం కడతారని శాసనమండలి ప్రతిపక్షనేత షబ్బీర్‌ అలీ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం సాయంత్రం స్థానిక కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. తెరాస ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్దిచెబుతారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కార్యకర్తలు, నాయకులు సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ పార్టీపై నమ్మకంతోనే కామారెడ్డి పట్టణం, మండలంలోని ఆయా గ్రామాల నుంచి వందమందికి పైగా పార్టీలో …

Read More »

సాహస యాత్రీకునికి ఎంపి సన్మానం

  కామారెడ్డి, జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అనుకోని సంఘటనలో రోడ్డు ప్రమాదానికి గురై కాలును పోగొట్టుకొని రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తూ ఒంటికాలితో సుదీర్ఘ సైకిల్‌ యాత్ర నిర్వహిస్తున్న షణ్ముఖరావు అనే వ్యక్తిని జహీరాబాద్‌ ఎంపి బి.బి.పాటిల్‌ ఆదివారం సన్మానించారు. మెదక్‌జిల్లా బొల్లారం గ్రామానికి చెందిన షన్ముఖరావు రహదారి భద్రతపై అవగాహన కల్పించడంలో భాగంగా డిసెంబరు 25న సైకిల్‌ యాత్ర ప్రారంభించారు. ఐదురోజుల్లో 700 కి.మీల యాత్ర పూర్తిచేశారు. ఉత్తర తెలంగాణలో 9 జిల్లాల గుండా యాత్ర సాగింది. …

Read More »

టీన్‌ రెగ్యులేటర్‌ నుంచి వాటర్‌ లీకేజీ

  నిజాంసాగర్‌, జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ ప్రధాన కాలువకు అనుసంధానంగా ఉన్న టీన్‌ రెగ్యులేటర్‌ ద్వారా నీరు వృధాగా మంజీరలోకి వెళుతుంది. యాసంగిలో లక్ష 8 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు నీటిపారుదల శాఖాధికారులు ప్రణాళిక రూపొందించారు. యాసంగి పంట సాగుకోసం 2017 డిసెంబరు 7 నుంచి నిజాంసాగర్‌ ప్రధాన కాలువ వెంట నీటిని విడుదల చేస్తున్నారు. ఇప్పటి వరకు నిజాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి దాదాపు 3 టిఎంసిల నీటిని పంట సాగుకోసం విడుదల చేశామని తెలిపారు. …

Read More »

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే బ్రాహ్మణులకు రిజర్వేషన్ల కల్పనకు కృషి

  కామారెడ్డి, జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే బ్రాహ్మణులకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేస్తానని శాసనమండలి విపక్షనేత షబ్బీర్‌ అలీ అన్నారు. ఆదివారం కామారెడ్డిలో బ్రాహ్మణ సమాఖ్య కార్యవర్గ అభినందన సభకు షబ్బీర్‌ అలీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బ్రాహ్మణుల అభివృద్దికి తాను శాయశక్తులా కృషి చేస్తానన్నారు. కామారెడ్డి బ్రాహ్మణ సంఘ భవన నిర్మాణం కోసం ఆర్థిక సాయం అందిస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా షబ్బీర్‌ అలీని కామరెడ్డి బ్రాహ్మణ సమాఖ్య …

Read More »