Breaking News

Daily Archives: January 8, 2018

నేడు మంత్రి పోచారం రాక

  కామారెడ్డి, జనవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో మంగళవారం నిర్వహించే సమీక్ష సమావేశానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి రానున్నారు. ఉదయం 9 గంటలకు జరిగే సమావేశంలో పోస్టు మాస్టర్లతో సమావేశం నిర్వహించి జీవనభృతి, పింఛన్‌ల పంపిణీ విషయంపై ఆదేశాలు జారీచేయనున్నారు.

Read More »

ఆటో డ్రైవర్ల ర్యాలీ – కలెక్టర్‌కు వినతి

  కామారెడ్డి, జనవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆటో డ్రైవర్లు తమ సమస్యల పరిష్కార సాధనకై సోమవారం జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ చేపట్టారు. స్తానిక ఆర్డీవో కార్యాలయం నుంచి కలెక్టర్‌ కార్యాలయం వరకు వందకుపైగా ఆటోలతో ర్యాలీ చేపట్టి కలెక్టర్‌ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఈసందర్భంగా సిఐటియు రాష్ట్ర నాయకుడు సిద్దిరాములు మాట్లాడుతూ ఆటో కార్మికులకు ఉద్యోగ భద్రత, ఇఎస్‌ఐ తదితర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్‌కు …

Read More »

డయల్‌ యువర్‌ ఎస్‌పిలో 3 ఫిర్యాదులు

  కామారెడ్డి, జనవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డయల్‌ యువర్‌ ఎస్‌పి కార్యక్రమంలో ప్రజల నుంచి 3 ఫిర్యాదులు అందినట్టు జిల్లా ఎస్‌పి శ్వేతారెడ్డి తెలిపారు. నసురుల్లాబాద్‌ నుంచి 1, లింగంపేట నుంచి 1, పిట్లం పోలీసు స్టేషన్‌లకు సంబంధిచి 1 ఫిర్యాదు అందినట్టు తెలిపారు. వాటిని పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత ఎస్‌హెచ్‌వోలకు ఆదేశాలు జారీచేసినటుట వివరించారు.

Read More »

జివికెలో ఉద్యోగావకాశాలు

  కామారెడ్డి, జనవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జివికె ఇఎంఆర్‌ఐలో ఉద్యోగ నియామకాల కోసం ఈనెల 9న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు హైదరాబాద్‌ ప్రోగ్రాం మేనేజర్‌ భూమానాగేందర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జివికె ఇఎంఆర్‌ఐలో బైక్‌ అంబులెన్సుల కోసం నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు కోరుతున్నామన్నారు. వీరికి బిఎస్‌సి లైప్‌ సైన్స్‌, బిఎస్‌సి నర్సింగ్‌ చేసి ద్విచక్ర వాహన లైసెన్సు కలిగి ఉన్న 22 నుంచి 30 సంవత్సరాల లోపు యువకులు అర్హులని పేర్కొన్నారు. కింగ్‌ కోటిలోని జివికె ఎంఆర్‌ఐ 108 కార్యాలయంలో …

Read More »

11న విశ్రాంత ఉద్యోగుల సమావేశం

  కామారెడ్డి, జనవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 11న విశ్రాంత ఉద్యోగుల సంఘ సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్టు సంఘం అధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డి, గౌరవ అధ్యక్షుడు భద్రయ్యలు తెలిపారు. సమావేశంలో సంఘ నియమావళి సవరణల కోసం చర్చించనున్నామన్నారు. సభ్యుల అభిప్రాయాలు తెలుసుకొని వాటిని అనుసరించి తుది నిర్ణయాలు తీసుకుంటామన్నారు. సమావేశంలో సంఘ వార్షిక నివేదిక, ఆర్థిక నివేదిక సమర్పిస్తామన్నారు. జనవరి, ఫిబ్రవరిల్లో సంఘం ఎన్నికలు నిర్వహించనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు వెంకటి, తదితరులు పాల్గొన్నారు.

Read More »

అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి

  కామారెడ్డి, జనవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని గంజ్‌ పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థి వడ్ల శివకుమార్‌ సోమవారం అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. తరగతి గదిలోనే ఒక్కసారిగా కుప్పకూలి మరణించడంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. తరగతిపై పెచ్చు కూలి మృతి చెందినట్టు వదంతులు వ్యాపించాయి. సంబందిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీకాంత్‌ మాత్రం అనారోగ్యంతోనే విద్యార్థి మృతి చెందినట్టు పేర్కొన్నారు.

Read More »

ఏఐఎస్‌బిడబ్ల్యు ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట నిరసన

  కామరెడ్డి, జనవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య ఏఐఎస్‌బిడబ్ల్యు ఆధ్వర్యంలో సోమవారం కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేశారు. సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు లీలా మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మండలాల్లో అక్రమ మద్యం, బెల్టు షాపుల వల్ల సాధారణ ప్రజల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. జిల్లాలో పేదలకు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు ఇవ్వడానికి సైతం సిద్దంగా లేకపోవడం ప్రభుత్వ వైపల్యమన్నారు. జిల్లా కేంద్రంలో …

Read More »

ఐహెచ్‌హెచ్‌ఎల్‌ నిర్మాణాలను జనవరి 26 నాటికి పూర్తిచేయాలి

  కామరెడ్డి, జనవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో ఐహెచ్‌హెచ్‌ఎల్‌ నిర్మాణాలను జనవరి 26 లోగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ ఆదేశించారు. కామరెడ్డి జనహిత భవనంలో సోమవారం జిల్లా అధికారులతో కన్వర్జెన్సీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పెండింగ్‌ ప్రజావాణి దరఖాస్తులను శాఖల వారిగా వెంటనే పూర్తిచేయాలని చెప్పారు. గణతంత్ర ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక ప్రదర్శనలు, ఇతర కార్యక్రమాలు ప్రణాళిక ప్రకారం రూపొందించాలని …

Read More »

ప్రజావాణిలో 58 ఫిర్యాదులు

  కామరెడ్డి, జనవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జనహిత భవనంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి 58 పిర్యాదులు అందినట్టు కలెక్టరేట్‌ అధికారులు తెలిపారు. జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ, సంయుక్త కలెక్టర్‌ సత్తయ్యలు నేరుగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. రెవెన్యూకు సంబంధించి 20, డిపివో 5, డిఆర్‌డిఎ 4, ఐసిడిఎస్‌ 3, గృహ నిర్మాణలు -3, సంక్షేమ శాఖ -3, ఎస్‌టి శాఖ-3తోపాటు వివిధ శాఖలకు సంబంధించి ఫిర్యాదులు అందాయన్నారు. ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు …

Read More »