Breaking News

Daily Archives: January 10, 2018

వసతి గృహాన్ని సందర్శించిన అధికారులు

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాఫూలే బాలికల వసతి గృహ పాఠశాలను బుధవారం రీజనల్‌ కో ఆర్డినేటర్‌ తిరుపతి సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని ఉపాధ్యాయుల, విద్యార్థుల హాజరు పట్టికలు, ఇతర రికార్డులు పరిశీలించారు. అనంతరం విద్యార్థులకు అందిస్తున్న భోజనం, వసతి, సౌకర్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బాలికా విద్యకోసం ఎంతో కృషి చేస్తుందని, కోట్ల రూపాయలు వెచ్చించి విద్యార్థులకు మెరుగైన ...

Read More »

ఇసుక ట్రాక్టర్‌ పట్టివేత

  బీర్కూర్‌, జనవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండలంలోని దామరంచలో అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ పట్టుకొన్నట్టు రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌ మోహన్‌ తెలిపారు. మంగళవారం అర్దరాత్రి దామరంచలోని మంజీర పరివాహక ప్రాంతం నుంచి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్నారన్న సమాచారం మేరకు మంగళవారం రాత్రి 2 గంటల సమయంలో ట్రాక్టర్‌ పట్టుకున్నామని తహసీల్‌ కార్యాలయానికి తరలించామని అన్నారు. వాట్టా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. విఆర్వో హన్మాండ్లు, విఆర్‌ఏ గణేశ్‌ లు పాల్గొన్నారు.

Read More »

తూతూ మంత్రంగా ఇంటర్వ్యూలు

  కామారెడ్డి, జనవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎంఎస్‌డబ్ల్యు ప్రాతిపదికన ప్రాజెక్టు డైరెక్టర్‌గా ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలకు గాను బుధవారం కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఇంటర్వ్యూలను అధికారులు తూతూమంత్రంగా నిర్వహించి మమ అనిపించారు. ఉదయం 10 గంటలకల్లా అభ్యర్థులు కార్యాలయంలో ఉండాలని ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని ముందస్తుగా చెప్పి, తీరా అభ్యర్థులు వెళ్లే సరికి పదిమందిని ముందస్తుగా ఎంపిక చేసినట్టు బోర్డుపై జాబితా ప్రత్యక్షమైంది. ఇదేమిటని అభ్యర్థులు ప్రశ్నించడంతో హుటాహుటిన బోర్డుతీసి పక్కనపెట్టారు. మొత్తం దరఖాస్తు చేసుకున్న 69 అభ్యర్థులందరికి ...

Read More »

ధర్మపురి ట్రస్టు ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలో బుధవారం ధర్మపురి ట్రస్టు ఆధ్వర్యంలో సంక్రాంతి పండగను పురస్కరించుకొని మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మొదటి, ద్వితీయ, మూడవ బహుమతులతో పాటు పాల్గొన్న ప్రతి ఒక్కరికి వెండి నాణేన్ని బహుకరించారు. ధర్మపురి ట్రస్టు, నగర మాజీ మేయర్‌ ధర్మపురి సంజయ్‌ మాట్లాడుతూ ట్రస్టు ఆధ్వర్యంలో ప్రతి సంక్రాంతికి ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నామని, మంచి ప్రతిభ కనబరిచిన మహిళలకు ప్రోత్సాహక బహుమతులు అందిస్తున్నామని ఆయన తెలిపారు. ...

Read More »

గుత్ప, అలీసాగర్‌ కార్మికుల వేతనాలు విధిగా అందించాలి

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గుత్ప, అలీసాగర్‌ ప్రాజెక్టులో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల జీతభత్యాల విషయంలో ప్రభుత్వం విధిగా ప్రతినెల అందించడం లేదని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రమేశ్‌బాబు ఆరోపించారు. బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. కార్మికులకు గత ఐదునెలలుగా జీతాలు అందడం లేదని, దీనివల్ల కార్మి కుటుంబాలు పస్తులుంటున్నాయని, ఎవరైనా కార్మికులు జీతాల గురించి అడిగితే వారిపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తు వేదింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. అనంతరం జిల్లా లేబర్‌ అధికారి ...

Read More »

సర్పంచ్‌ను బహిస్కరించిన వారిపై చర్యలు తీసుకోవాలి

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల్కొండ మండలం బుస్సాపూర్‌ గ్రామానికి చెందిన దళిత సర్పంచ్‌ మమత శ్రీనివాస్‌ను గ్రామాభివృద్ది కమిటీ గ్రామ బహిష్కరణపై బాధితురాలు మమత శ్రీనివాస్‌ ఈనెల 8న జిల్లా కలెక్టర్‌, పోలీసు కమీషనర్‌కు, మెండోరా పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు స్పందించలేదని వారు వాపోయారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో వారు విలేకరులతో మాట్లాడారు. అధికారులు విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారని, నేడు విచారణ చేస్తామన్న ఆర్మూర్‌ ఏసిపి ఆర్డీవో గ్రామానికి ఇంతవరకు ...

Read More »

గర్భవతులకు, బాలింతలకు పోషకాహారం అందించాలి

  బీర్కూర్‌, జనవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :గర్భవతులకు, బాలింతలకు పోషకాహారం అందించాలని ఎంపిడివో భరత్‌కుమార్‌ అన్నారు. బీర్కూర్‌ మండల కేంద్రంలోని సెంటర్‌-5 అంగన్‌వాడి పాఠశాలను పరిశీలించారు. మొదట అంగన్‌వాడిలోని రిజిష్టర్‌లను తనిఖీ చేశారు. అంగన్‌వాడిలోని చిన్నారులతో మాట్లాడారు. చిన్నారులకు అందిస్తున్న వంటకాలను పరిశీలించారు. అనంతరం గర్భిణీలకు, బాలింతలకు పోషకాహారం అందేలా మెను ప్రకారం భోజనం అందించాలని సూచించారు. తప్పనిసరిగా చిన్నారులకు, బాలింతలకు, గర్భవతులకు కోడిగుడ్లు అందించాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఉన్నారు.

Read More »

ఇంటికో ఉద్యోగం వెంటనే ప్రకటించాలి

  బీర్కూర్‌, జనవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ వెంటనే ఇంటికో ఉద్యోగం ప్రకటించాలని నిజామాబాద్‌ బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు దొరబాబు డిమాండ్‌ చేశారు. మండల కేంద్రం బీర్కూర్‌లో బుధవారం మండల బిజెపి ఆధ్వర్యంలో ఉద్యోగుల ఒకరోజు నిరసన దీక్ష చేపట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి లక్ష ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్ళు గడిచినా నామమాత్రంగా 15 వేల ఉద్యోగాలు భర్తీచేశారని పేర్కొన్నారు. విద్యార్థులను అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చారని, ఇపుడు వారికి అన్యాయం ...

Read More »

మందేస్తే నడిరోడ్డే నా పానుపు

  కామారెడ్డి, జనవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మందేస్తే నడిరోడ్డే నా పవళింపు పానుపు అంటున్నారు మద్యం ప్రియులు. కామరెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా నడిరోడ్డులో ట్రాఫిక్‌ పోలీసు బూత్‌ సాక్షిగా దర్శనమిచ్చిన చిత్రమిది. నిజామాబాద్‌ న్యూస్‌ కెమెరాకు చిక్కింది. కామారెడ్డిలో వైన్స్‌ల వద్దే చిత్తుగా తాగడం, రోడ్డుపై ఎక్కడ పడితే అక్కడ పడిపోవడం నిత్య కృత్యమైంది. వైన్స్‌ల బయట సిట్టింగ్‌లు చేయించరాదని చట్టాలు ఉన్నప్పటికి, వైన్స్‌ల బయటే తాగుతూ కూర్చోవడం ఇక్కడ ప్రతిరోజు దర్శనమిస్తుంది. ఫుల్లుగా ...

Read More »

ఇందూరు సింధూర ముగ్గుల పోటీల లోగో ఆవిష్కరణ

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలో బుధవారం ఇందూరు సింధూర ముగ్గుల పోటీల లోగోను బిజెపి నగర అధ్యక్షుడు యెండల సుధాకర్‌ ఆవిష్కరించారు. నగరంలోని 4వ జోన్‌ ఆద్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ నగరం ఆధ్వర్యంలో 4వ జోన్‌ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. చక్కటి ముగ్లులు వేసిన వారికి ప్రథమ బహుమతి రూ. 5 వేలు, ద్వితీయ బహుమతి ...

Read More »

అధికారులు తీరు మార్చుకోవాలి

  – జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అధికారులు తమ తీరు మార్చుకొని ఉద్యోగం పట్ల బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు అన్నారు. బుధవారం మోర్తాడ్‌ మండలం పాలెం గ్రామంలో ఎస్‌సిలకు పంపిణీ చేసిన భూమి అభివృద్దిలో భాగంగా సాగు యోగ్యత కోసం ఏర్పాటు చేసిన నీటి వనరులను కలెక్టర్‌ పరిశీలించారు. అనంతరం మోర్తాడ్‌ మండలం తిమ్మాపూర్‌ గ్రామంలో వ్యక్తిగత మరుగుదొడ్లు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామాలను పరిశుభ్రంగా ...

Read More »

డయల్‌ యువర్‌ సిపికి 1131 పిర్యాదులు

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీసు కమీషనరేట్‌ పరిధిలో మొత్తం 1131 ఫిర్యాదులు అందినట్టు నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ ఒక ప్రకటనలో తెలిపారు. డయల్‌ 100 ద్వారా 10.12.2017 నుంచి 09.01.2018 వరకు ఫోన్‌ కాల్స్‌ అందినట్టు తెలిపారు. శారీరక హింసల కింద 49 ఫిర్యాదులు, రోడ్డు ప్రమాదాల విషయంలో 326 కేసులు, ఆస్తి తగాదాల విషయంలో 18 కేసులు, ఆత్మహత్య, ఆత్మహత్య యత్నాల విసయంలో 48 కేసులు, ఇతర కేసులు 666 ...

Read More »

రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌దే భవిష్యత్తు

  కామారెడ్డి, జనవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాబోయే రోజుల్లో ప్రజలు తెరాసకు గుణపాఠం చెప్పి కాంగ్రెస్‌ పార్టీకి పట్టం కడతారని శాసనమండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌ అలీ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఎల్లారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి మండల కేంద్రంలో భారీ బైక్‌ ర్యాలీ చేపట్టారు. అనంతరం ప్రయివేటు ఫంక్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. రాహుల్‌ గాంధీ నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందన్నారు. దళితులకు మూడెకరాల భూ పంపిణీ, నిరుద్యోగులకు ...

Read More »

యువత వజ్ర సంకల్పం కలిగి ఉండాలి

  కామారెడ్డి, జనవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువత వజ్ర సంకల్పం కలిగి ఉండాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణ విద్యార్థులకు ఉద్బోదించారు. జనవరి 12న వివేకానంద జయంతిని పురస్కరించుకొని జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా బుధవారం లింగంపేట మండల కేంద్రంలో యువ యూత్‌ ఆద్వర్యంలో వివిధ ప్రభుత్వ కళాశాలల విద్యార్థులతో కార్యక్రమం నిర్వహించారు. దీనికి జిల్లా కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. స్వామీజీ బోధనలు అందరికి శిరోధార్యమని, యువతకు మార్గనిర్దేశకమని, ఆయన బోధనలు అందరు చదివి ...

Read More »

పోలియో మహమ్మారిని తరిమికొట్టేందుకు సన్నద్దం కావాలి

  కామారెడ్డి, జనవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్స్‌పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసి పోలియో మహమ్మారిని తరిమికొట్టేందుకు సిద్దం కావాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సిబ్బందికి సూచించారు. బుధవారం జనహిత భవనంలో ఈనెల 28 నుంచి 30 వరకు మూడురోజుల పాటు నిర్వహించనున్న పల్స్‌పోలియో కార్యక్రమంపై వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా టాస్క్‌ ఫోర్సు కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ టాస్క్‌ పోర్సు కమిటీలో భాగస్వాములైన అందరు కలిసి పల్స్‌పోలియో ...

Read More »

ఐకెపి భవన నిర్మాణ పనులు ప్రారంభం

  కామారెడ్డి, జనవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం తిమ్మక్‌పల్లి గ్రామంలో ఐకెపి భవన నిర్మాన పనులకు బుధవారం ఎంపిపి లద్దూరి మంగమ్మ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలో ఐకెపి భవనం నిర్మించాలని గతంలో తీర్మానించామని, ఇందులో భాగంగా విడుదల చేసిన నిధులతో ఐకెపి, ఏఎన్‌ఎంల భవనాన్ని నిర్మించడానికి శంకుస్థాపన చేసినట్టు తెలిపారు. త్వరలో అందుబాటులోకి భవనం వస్తుందని పేర్కొన్నారు. ఆమె వెంట సర్పంచ్‌, ప్రజాప్రతినిదులు ఉన్నారు.

Read More »

టిటిఎప్‌ ఆద్వర్యంలో క్యాలెండర్‌ ఆవిష్కరణ

  కామారెడ్డి, జనవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సదాశివనగర్‌ మండల కేంద్రంలో బుధవారం తెలంగాణ టీచర్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ నూతన సంవత్సరంలో అందరికి మేలు జరగాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో టిటిఎఫ్‌ ప్రతినిదులు వాసు, అంజయ్య, రవి, శ్రీధర్‌లు ఉన్నారు.

Read More »

పనులు నాణ్యతతో చేపట్టాలి

  బీర్కూర్‌, జనవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పనుల నిర్మాణంలో నాణ్యతతో చేపట్టాలని మండల అభివృద్ది అధికారి భరత్‌కుమార్‌ అన్నారు. బీర్కూర్‌ మండల కేంద్రంలోని ఎస్‌సి కాలనీలో అంగన్‌వాడి భవనం చుట్టు నిర్మిస్తున్న ప్రహరీ గోడ నిర్మాణ పనులను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండల జనరల్‌ ఫండ్‌ నుంచి రూ. 2 లక్షల వ్యయంతో అంగన్‌వాడి చుట్టు ప్రహరీ నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. ప్రతిరోజు సక్రమంగా నీటిని కొడుతూ ఉండాలని పనుల్లో నాణ్యత పాటించాలని కాంట్రాక్టర్‌కు ...

Read More »

మార్కండేయ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి

  కమారెడ్డి, జనవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 21వ తేదీన మార్కండేయ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని పద్మశాలి సంఘం ఆధ్యాత్మిక గురువు నర్సయ్య పిలుపునిచ్చారు. సిరిసిల్లా నుంచి కామారెడ్డికి విచ్చేసిన ఆయన సంఘ భవనంలో జయంతి ఉత్సవాల గోడప్రతులను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు రాములు, చాట్ల రాజేశ్వర్‌, శ్రీహరి, లక్ష్మణ్‌, తదితరులున్నారు.

Read More »

సమాజ సేవకులకు సన్మానం

  కామారెడ్డి, జనవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆధ్వర్యంలో సామాజిక సేవ, సంఘ సేవ చేసిన పలువురిని బుధవారం ఆర్‌కె డిగ్రీ కళాశాలలో సన్మానించారు. గత కొద్ది నెలలుగా సేవచేస్తున్నన రాజ్‌కుమార్‌, మోతె బాల్‌రాజ్‌గౌడ్‌, ముత్యపు ఆంజనేయులు తదితరులను ప్రతినిదులు సన్మానించారు. కార్యక్రమంలో చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ జిల్లా అధ్యక్షుడు రవికుమార్‌, ప్రతినిధులు గబ్బుల బాలయ్య, గౌరీ శంకర్‌, శ్రీనివాస్‌, గిరిధర్‌, ముప్పారపు ఆనంద్‌, మహేశ్‌గుప్త తదితరులు పాల్గొన్నారు.

Read More »