Breaking News

వెనకబడిన కులాల వివరాలు సేకరించాలి

 

కామారెడ్డి, జనవరి 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వెనకబడిన కులాల సంక్షేమానికి ప్రభుత్వం అధిక మొత్తంలో నిధులు కేటాయిస్తుందని వారి వివరాలు సేకరించి సన్నద్దంగా ఉండాలని బిసి వెల్పేర్‌ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ బుర్ర వెంకటేశం శుక్రవారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా బిసి వెల్పేర్‌ అధికారులకు సూచించారు. కలెక్టర్‌ చాంబర్‌లో జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణతోపాటు బిసి వెల్పేర్‌ అధికారులు కాన్ఫరెన్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్‌ సెక్రెటరీ మాట్లాడుతూ రాబోయే పదిరోజుల్లో నాయిబ్రాహ్మణ, ఫిషర్‌ మెన్‌, ఎంబిసి, విశ్వబ్రాహ్మణ, సంచార కులాలకు ప్రభుత్వం ద్వారా సబ్సిడీ, ఇతరత్రా నిధులు మంజూరు చేస్తుందన్నారు. ఇందుకోసం జిల్లాస్తాయిలో లబ్దిదారుల వివరాలు సేకరించి అర్హులను ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకునేలా ప్రచారం చేయాలన్నారు. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను పెళ్లి రోజు అందించడానికి ముందస్తు చర్యలుతీసుకోవాలని ఆదేశించారు. అన్ని రెసిడెన్సియల్‌ పాఠశాలలకు సొంత భవనాలు, భూములు కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా బిసి మేళాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో బిసి వెల్పేర్‌ అధికారి దేవిదాస్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

ఐటి సెల్‌ కార్యక్రమానికి తరలిన బిజెపి శ్రేణులు

  కామారెడ్డి, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిజెపి రాష్ట్ర ఐటిసెల్‌ కార్యక్రమానికి ఆదివారం వెళ్తున్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *