Breaking News

ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలి

 

నిజాంసాగర్‌, జనవరి 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలని డిహెచ్‌ఇ సంజీవరెడ్డి తెలిపారు. నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని అన్ని మండలాల్లో ఏఎన్‌ఎంలకు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. అనంతరం ఏఎన్‌ఎంలకు బిఎస్‌ఎన్‌ఎల్‌ సిమ్‌ కార్డులను అందజేశారు. మోబైల్‌ యాప్‌ ద్వారా ఆరోగ్య విషయాలను, రోజువారి డాటా ఎలా పొందుపర్చాలనే విషయాలపై అవగాహన కల్పించారు. వైద్య సేవలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పొందుపరచాలని సూచించారు. సమావేశంలో సాయమ్మ, మాణిక్యం, కాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఉపాధి హామీ ఏపివోబదిలీ

  నిజాంసాగర్‌, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల ఉపాధి హామీ ఏపివో సుదర్శన్‌ బాన్సువాడకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *